తెలంగాణ

telangana

కేసీఆర్​కు గుడిసెల్లో ఉన్న పేదోళ్లు కనబడటం లేదా: బండి సంజయ్

By

Published : Feb 12, 2023, 5:16 PM IST

Updated : Feb 12, 2023, 5:38 PM IST

Bandi Sanjay Comments on CM KCR: అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని తిట్టడానికే సమయాన్ని కేటాయిస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Bandi Sanjay comments on CM KCR
Bandi Sanjay comments on CM KCR

కేసీఆర్​కు గుడిసెల్లో ఉన్న పేదోళ్లు కనబడటం లేదా: బండి సంజయ్

Bandi Sanjay Comments on CM KCR: అసెంబ్లీలో ప్రజల సమస్యలను మరచి.. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాని మోదీని తిట్టడానికే సమయం కేటాయిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన ప్రజా గోస-బీజేపీ భరోసా కార్నర్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు రానున్న రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు దిశా నిర్దేశం చేశారు.

అనంతరం బండి సంజయ్​ మాట్లాడుతూ.. కేంద్రం నిధుల గురించి గతంలో విసిరిన సవాల్​కు ఇప్పటికీ స్పందన లేదన్నారు. అసెంబ్లీలో ప్రధాని మోదీ లేనప్పుడు ఆయన గురించి మాట్లాడటం సభ ఉల్లంఘనేనని.. వారిపై చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు. 100 గదులతో ప్రగతి భవన్ నిర్మించుకున్న కేసీఆర్​కు.. గుడిసెలలో నివసిస్తున్న పేద ప్రజలు కనబడటం లేదా అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత విద్య, వైద్యం అందిస్తామన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయక రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా నూతన సచివాలయాన్ని మార్చుతామని అన్నారు. బీజేపీ నిర్వహిస్తున్న శక్తి కేంద్రాల ద్వారా పార్టీని పటిష్ఠపరచి ఎన్నికలకు సిద్ధంగా ఉంచాలని పార్టీ శ్రేణులకు బండి పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 12, 2023, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details