తెలంగాణ

telangana

మే 7 తర్వాత కరీంనగర్‌ కరోనా ఫ్రీ జోన్‌ : మంత్రి గంగుల

By

Published : Apr 25, 2020, 5:56 PM IST

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడం వల్ల కరోనాను కట్టడి చేయగలిగామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజలంతా లాక్‌డౌన్‌కు సహకరించారని కోరారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు ఇళ్లలోనే నమాజ్ చేయాలని సూచించారు. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవాలని ఈటీవీ భారత్​ ముఖాముఖిలో తెలిపారు.

gangula kamalakar
gangula kamalakar

మంత్రి గంగుల కమలాకర్​తో ముఖాముఖి

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు ఏంటి?

కరీంనగర్​లో ఒకేసారి 8 కరోనా పాజిటివ్ కేసులు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్​ మమ్మల్ని అప్రమత్తం చేశారు. జిల్లాకు పంపించారు. కొన్ని కఠిన నిబంధనలు అమలు చేశాం. ఇండోనేషియా వాళ్లు తిరిగిన ప్రదేశాల్లోని ప్రజలను స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరాం. వాళ్లంతా సహకరించారు. ఇప్పుడు రెండు యాక్టివ్ పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. మే 7 వరకు ఇలాగే లాక్​డౌన్​ను పాటిస్తే కరీంనగర్‌ కరోనా ఫ్రీ జోన్‌ అవుతుంది.

ఈ రోజు నుంచి రంజాన్​ మాసం ప్రారంభమైంది. ముస్లింలకు మీరు ఎలాంటి సూచనలు చేశారు?

రంజాన్​ మాసం మొత్తం ఇంటికే పరిమితమై నమాజ్ చేసుకోవాలని ముస్లింలను కోరాం. ఇలా చేయడం వల్ల వైరస్ వ్యాప్తి జరగదని సూచించాం.

లాక్​డౌన్ నుంచి పండ్ల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారా?

పండ్లు ఇళ్ల వద్దకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం. అధికారులతో చర్చించి ఏర్పాట్లు చేస్తాం.

పంట కొనుగోళ్లపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. కొన్ని చోట్ల పంట తగులబెట్టుతున్నారు. దీనికి కారణాలు ఏంటి?

పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. కరోనా ప్రభావం ఉన్నా కూడా పంట కొనుగోలుకు ఇబ్బంది ఉండకూడదని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంట కొనుగోలు కేంద్రాలను కూడా పెంచాం. పంటను తగులబెట్టవద్దు.

తాలు అధికంగా ఉందని పంట కొనుగోలు చేయట్లేదు. అలాంటి కఠిన నిబంధనలు అమలు చేయడానికి కారణం ఏంటి?

ఈ నిబంధనలు పెట్టింది ఎఫ్​సీఐ. ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలోని సంస్థ. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర భాజపా నేతలు కోరాలి. తాలు ఉన్నా... పంట కొనుగోలు చేయాలని రైస్​ మిల్లర్లను కోరాం. నష్టం వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పాం.

ఇదీ చదవండి:ఈ వస్త్రాలతో చేసిన మాస్కులతోనే వైరస్​కు బ్రేక్​!

ABOUT THE AUTHOR

...view details