తెలంగాణ

telangana

రాహదారి లేక మూడురాష్ట్రాలకు రాకపోకలు బంద్

By

Published : Sep 21, 2019, 7:59 PM IST

వరద ఉద్ధృతికి కామారెడ్డి జిల్లా పెద్దదేవాడ, పుల్కల్‌ గ్రామాల మధ్య ఉన్న తాత్కాలిక రాహదారి కొట్టుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రాహదారి లేక మూడురాష్ట్రాలకు రాకపోకలు బంద్

కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మండలం పెద్దదేవాడ, పుల్కల్‌ గ్రామాల మధ్య మూడు రోజులుగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెండు గ్రామాల మధ్య ఉండే వాగుపై వంతెన లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై ఏర్పాటు చేసిన తాత్కలిక రహదారి వరద ఉద్ధృతి కొట్టుకుపోయింది. బాన్సువాడ, బిచ్‌కుంద, మద్నూర్‌, జుక్కలే మండలాలకే కాకుండా...మహారాష్ట్ర, కర్ణాటకతో తెలంగాణను కలిపే ప్రధాన రహదారి. 2016లో వంతెన నిర్మాణానికి రూ. 5.30 కోట్ల నిధులు మంజూరు చేయగా... పనులు ప్రారంభించారు. కానీ పూర్తి చేయకుండానే అసంపూర్తిగా వదిలేశారు. ఇప్పటికీ... అధికారులు స్పందిచలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాహదారి లేక మూడురాష్ట్రాలకు రాకపోకలు బంద్
Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details