తెలంగాణ

telangana

కరోనా నియంత్రణకు సరైన ఆయుధం లాక్​డౌన్ : కలెక్టర్

By

Published : May 23, 2021, 1:07 PM IST

Updated : May 23, 2021, 7:21 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో లాక్​డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ శరత్ పరిశీలించారు. అనంతరం కరోనా నియంత్రణపై అధికారులు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేయాలని పోలీసులను ఆదేశించారు.

kamareddy collector review meeting
కరోనా నియంత్రణ చర్యలపై కలెక్టర్ సమీక్షా సమావేశం

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కరోనా నియంత్రణపై అధికారులతో జిల్లా కలెక్టర్ శరత్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును సందర్శించారు. కరోనా బాధితులు, ఇతర రోగుల ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ పరికరాల పనితీరు, ఆక్సిజన్ నిల్వల గురించి అధికారులతో చర్చించారు. ఏరియా ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం వంద పడకలు అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ వివరించారు.

కరోనా నియంత్రణకు సరైన ఆయుధం లాక్​డౌన్​యే అన్ని కలెక్టర్ శరత్ తెలిపారు. బాన్సువాడలో అమలవుతున్న లాక్​డౌన్ తీరును దగ్గరుండి పరిశీలించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారికి జరిమానాలు విధించారు. లాక్​డౌన్ కఠినంగా అమలు చేయాలని పోలీసు శాఖకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజా గౌడ్, తహసీల్దార్ గంగాధర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రమేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం

Last Updated : May 23, 2021, 7:21 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details