తెలంగాణ

telangana

గన్నీ సంచుల కొరత.. అన్నదాత ఆగ్రహం

By

Published : May 17, 2021, 1:43 PM IST

అసలే అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఆపై గన్నీ సంచుల కొరత వెరసి రైతన్నల కోపం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం గన్నీ సంచులను తక్కువగా సరఫరా చేయడంతో పులికల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చిన గన్నీబ్యాగులను రైతులు ఎత్తుకెళ్లారు.

gunny-bags-shortage-in-jogulamba-gadwal-news
గన్నీ సంచుల కొరత.. అన్నదాత ఆగ్రహం

జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పులికల్​లో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి 20 వేల గన్నీసంచులు అవసరం ఉండగా.. ఆదివారం కేవలం 7 వేలు మాత్రమే వచ్చాయి. అప్పటికే వేచి చూస్తున్న రైతులు గన్నీసంచులను చూసి తక్కువగా తెచ్చారని సింగిల్‌ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మూకుమ్మడిగా వాటిని తీసుకెళ్లారు. సంచుల కోసం రైతుల మధ్య తోపులాట జరిగింది.

చివరకు విండో సిబ్బంది జోక్యం చేసుకుని సర్ది చెప్పి గన్నీ సంచులు ఎవరెన్ని తీసుకున్నారో జాబితా రాసుకున్నారు. మండలంలోని ఎనిమిది కేంద్రాలకు కలిపి సుమారు 50 వేల గన్నీ సంచులు అవసరం ఉండగా.. ఆదివారం 10 వేలు రాగా 7 వేలు పులికల్‌కు, 3 వేలు సింధనూరుకు తీసుకెళ్లారు.

అయిదు రోజులుగా గన్నీసంచుల కోసం ఎదురు చూస్తున్నా.. ఇవ్వడం లేదని.. వర్షాలతో ధాన్యం తడుస్తోందని.. తమ బాధలు ఎవరితో చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ కష్టాలు అర్థం చేసుకుని గన్నీ సంచులను త్వరగా మంజూరు చేసి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు కోరారు.

గన్నీ సంచుల కొరత.. అన్నదాత ఆగ్రహం

ఇదీ చూడండి:జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా కట్టడి చర్యలపై మంత్రుల సమీక్ష

ABOUT THE AUTHOR

...view details