తెలంగాణ

telangana

Bandi Sanjay on TRS: వారి ఆత్మహత్యలకు తెరాస నాయకులే కారణం: బండి సంజయ్

By

Published : Apr 16, 2022, 4:16 PM IST

Bandi Sanjay on TRS: కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెరాస బెదిరింపులకు భయపడే పార్టీ కాదన్నారు. కేసీఆర్‌ను గద్దె దించేదాకా తన పోరు ఆగదన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో ఆయన మాట్లాడారు.

Bandi Sanjay on TRS
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Bandi Sanjay on TRS: భాజపా కార్యకర్తలను తెరాస నాయకులు వేధింపులకు గురి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెరాస అవినీతికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినందుకు ఖమ్మంకు చెందిన సాయి గణేష్ అనే భాజపా కార్యకర్తపై ఏకంగా 16 కేసులు పెట్టారన్నారు. తెరాస బెదిరింపులకు భయపడే పార్టీ కాదని... కేసీఆర్‌ను గద్దె దించేదాకా పోరాటం కొనసాగిస్తామన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర 3వ రోజు పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కంచుపాడు నుంచి ప్రారంభమై పాదయాత్ర తక్కశిల వరకు కొనసాగింది. అనంతరం గ్రామస్తులతో '‘ప్రజల గోస- బీజేపీ భరోసా‘' పేరిట నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇవాళ మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన గంగం సంతోష్, అతని తల్లి స్థానిక మున్సిపల్ ఛైర్మన్ వేధింపులు భరించలేక చనిపోతున్నామంటూ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ రెండు చావులకు ముమ్మాటికీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, తెరాస నేతలే బాధ్యులన్నారు. కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, సీఎం అంతు చూసేదాకా భాజపా పోరు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

వైద్యం కోసం పక్క రాష్ట్రానికి పోవాల్సిన పరిస్థితి: అలంపూర్‌ ప్రాంతంలో ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ చేతగానితనం వల్లే రోగమొస్తే పక్క రాష్ట్రానికి పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ చేసింది ఏముందని బండి ప్రశ్నించారు. అకాల వర్షాలు, తెగులు పట్టి పంటలు నష్టపోయి రైతులు అల్లాడుతుంటే ఏనాడూ నష్ట పరిహారం ఇవ్వని కేసీఆర్ పక్క రాష్ట్రాలు తిరుగుతూ ఏదో ఉద్ధరిస్తానంటూ డ్రామాలాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం లక్ష 40 వేల ఇళ్లు కేటాయిస్తే.... డబ్బును దారి మళ్లించిన కేసీఆర్ ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. మంజూరైన ఇళ్లను పూర్తి చేస్తే మరో లక్ష ఇళ్లు కేంద్రం ద్వారా ఇప్పించే బాధ్యతను తీసుకుంటానని సవాల్ విసిరినా కేసీఆర్‌ స్పందించలేదన్నారు. కేసీఆర్ అక్రమాలు, అవినీతిపై భాజపా ఉద్యమిస్తుంటే కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.

కేసీఆర్​ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ ముందుకొచ్చా. దళితులకు మూడు ఎకరాలు ఇస్తానని ఏం చేసిండు. అంబేడ్కర్ జయంతి రోజు కూడా ఆయన రాడు. పేదలంటే ఆయనకు చిన్నచూపు. ఉద్యోగాల కోసం మేం కొట్లాడితే మొన్న నోటిఫికేషన్లు ఇచ్చిండు. కేంద్రం పైసలు ఇస్తుంటే ఈయన మాత్రం పబ్బం గడుపుకుంటున్నాడు. ఉద్యోగుల కోసం కొట్లాడితే నన్ను జైలుకు పంపిండు. దేశంలో భాజపాను కేసీఆర్ ఓడగొడతాడంటా. దిల్లీకి ఎందుకు పోతాడంటే పన్ను, చెవి నొప్పి చూపించుకోనేందుకు పోతాడు. గోవాలో, మణిపూర్​లో భాజపాను గెలుపును అడ్డుకున్నాడా.? పేదలంతా మోదీకి జై కొడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details