తెలంగాణ

telangana

DK ARUNA: వాల్మీకులను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారు: డీకే అరుణ

By

Published : Sep 15, 2021, 5:11 PM IST

BJP national vice president DK Aruna

ప్రజలకిచ్చిన ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని నిలదీశారు. గద్వాలలోని తన నివాసంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని ఇచ్చినా హామీ ఏమైందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. మేము చేసిన అభివృద్ధి పనులకు గులాబీ రంగులేసి ప్రారంభ కార్యక్రమాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూడోసారి గద్వాలకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఇంతవరకు హ్యాండ్లూమ్​ పార్క్ ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. నేను 50 ఎకరాలు సేకరిస్తే ఇప్పటివరకు పట్టించుకోలేదని విమర్శించారు. గద్వాలలోని తన నివాసంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.

అబద్ధపు హామీలు, మాయమాటలతో ప్రజలను మోసం చేయడం తండ్రి, కొడుకులకు అలవాటై పోయిందన్నారు. నన్ను విమర్శించే అర్హత కూడా మంత్రి కేటీఆర్​కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిల్లీ పంపిన కాపీ చూపించండి

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి దిల్లీకి పంపిన జీవో కాపీని చూపించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ఆ జీవో కాపీ లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

తీర్మానం చేసి పంపండి.. నేను తీసుకొస్తా

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడం, గద్వాలకు మెడికల్ కాలేజ్​పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్మానం చేసి దిల్లీకి పంపాలని డీకే అరుణ అన్నారు. గద్వాల ప్రజల పక్షాన పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తానని డీకే అరుణ పేర్కొన్నారు.

ముచ్చటగా ముూడోసారి గద్వాలకు మంత్రి కేటీఆర్ వచ్చిండు. వాల్మీకులను ఎస్టీల్లో చేర్చుతామని హామీ ఇచ్చిండ్రు. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి జీవో ఇస్తామని వాగ్దానం చేసిన్రు. వాల్మికులెవరు మిమ్మల్ని అడగలే. మీ చేతగానప్పుడు హామీలు ఎందుకిచ్చారు. అబద్ధాలు చెప్పడంలో వాళ్ల నాన్నను మించిపోయాడు. మీరు కేంద్రానికి పంపిన తీర్మానం కాపీ చూపించు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్రం చెబుతోంది. నన్ను విమర్శించే అర్హత మంత్రి కేటీఆర్​కు లేదు. నేను 50 ఎకరాలు సేకరిస్తే హ్యండ్లూమ్​ పార్క్ ఏర్పాటు చేసే దమ్ము లేదు. మేము చేసిన పనులకు గులాబీ రంగులేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ హామీలు ఇవ్వడం.. ప్రజలను మోసం చేయడం మీకు అలవాటు. ముందు వాల్మీకులకు ఎస్టీ జాబితాలో చేర్చడంపై, గద్వాలకు మెడికల్ కాలేజ్ కోసం తీర్మానం చేసి పంపండి. నేను సాధించి తెచ్చుకుంటా. - డీకే అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

ఇదీ చూడండి:MURALIDHAR RAO: కేసీఆర్​ది అవినీతి పాలన.. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

ABOUT THE AUTHOR

...view details