తెలంగాణ

telangana

కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ‘ఉగ్ర’ గోదావరి.. రికార్డు స్థాయిలో వరద

By

Published : Jul 13, 2022, 11:48 AM IST

Updated : Jul 13, 2022, 12:28 PM IST

record level Inflow to Kaleshwaram Project : తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఫలితంగా ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటిసారి రికార్డు స్థాయిలో భారీ వరద నమోదైంది. మేడిగడ్డలో మొత్తం 85 గేట్లు, సరస్వతీ బ్యారేజీలో 62 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

Kaleshwaram Project record level Inflow
కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద.. చరిత్రలో తొలిసారి..!

Kaleshwaram Project record level Inflow : తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదనీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద ధాటికి పుష్కరఘాట్లు మునిగిపోయాయి. అనంతరం రోడ్లపైకి.. ఆ తర్వాత దుకాణాల్లోకి వరదనీరు చేరింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు మొదటిసారి రికార్డు స్థాయిలో భారీ వరద నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీలోకి ఉద్ధృతంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ బ్యారేజీలో మొత్తం 85 గేట్లను తెరిచి 12,10,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సరస్వతీ బ్యారేజీలో 65 గేట్లకు గానూ 62 గేట్లు ఎత్తారు. బ్యారేజీకి 7,78,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. అదే స్థాయిలో ఔట్ ఫ్లో జరుగుతోంది.

మరోవైపు ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద కూడా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వదర ఎక్కువగా వస్తుండటంతో అక్కడ మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు.

మరోవైపు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారు పర్యాటక ప్రాంతం పాండవుల గుట్టలో జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి అందాలతో పర్యాటకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. జలపాతం వద్ద పర్యాటకులు ఫొటోలు, సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Jul 13, 2022, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details