తెలంగాణ

telangana

దమ్మన్నపేటలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు

By

Published : Feb 9, 2021, 10:44 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. దమ్మన్నపేట గ్రామంలో రైతు వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, తదితరులు పాల్గొన్నారు.

raithu-vedhika-at-dammannapet-in-bhupalpally-opened-by-ministers-errabelli-and-singireddy-niranjan-reddy
దమ్మన్నపేటలో రైతు వేదికను ప్రారంభించిన మంత్రులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామంలో రైతు వేదికను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా వచ్చింది. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో చెప్పాలి. వంద రోజులుగా దిల్లీలో రైతులు నిరసన తెలుపుతున్నా.. భాజపా నేతలు పట్టించుకోవడం లేదు."

-ఎర్రబెల్లి దయాకర్రా​వు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి

"రాష్ట్రంలో కరెంట్​కు, నీళ్లకు కొదువ లేదు. ఒకే వేదికలో రైతులందరూ కలిసి ఏ ఏ పంటలు పండించుకోవాలో నిర్ణయించుకుని ఆ పంటలు వేసుకోవచ్చు. గ్రామంలో వ్యవసాయశాఖ అధికారి సలహాలు, సూచనలతో పంటలు వేయండి. అందరూ ఒకే పంటలు వద్దు."

-సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, జడ్పీ ఛైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

ABOUT THE AUTHOR

...view details