తెలంగాణ

telangana

Nainpaka Lakshmi Narasimha Swamy Temple : శిథిలావస్థలో నైనిపాక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం.. పట్టించుకునే నాథుడే లేపాయే!

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2023, 11:00 PM IST

Nainpaka Lakshmi Narasimha Swamy Temple : ఓ ఆలయంలో ఒకే శిలపై నాలుగు వైపులా నలుగురు దేవతామూర్తులు కొలువుతీరి పూజలందుకుంటున్నారు. అత్యద్భుతమైన శిల్ప సౌందర్యం.. ఆ ఆలయానికి సొంతం. ఇన్ని ప్రత్యేకతలున్నా.. ఆలయ అభివృద్ధిపై అధికారులు శీతకన్ను వేస్తున్నారు. పునరుద్ధరణ పనులను సగంలోనే ఆపేయడంతో భక్తులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Lakshmi Narasimha Swamy Temple in Bhupalpally district
Nainapaka Sri Sarvatobhadra Lakshmi Narasimha Swamy Temple

Nainpaka Temple శిథిలావస్థలో నైనిపాక లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

Nainpaka Lakshmi Narasimha Swamy Temple : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైనపాక శ్రీ సర్వతోభద్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎన్నో విశిష్టతల సమ్మేళనం. నలువైపులా ముఖ ద్వారాలతో.. ఏకశిలపైనే నాలుగు దిశల్లో దేవతామూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుతీరాయి. తూర్పున లక్ష్మీ నరసింహ స్వామి.. దక్షిణ వైపున వేణుగోపాలస్వామి, పడమరలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఉత్తరాన సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి.. ఇలా దేవతలూ.. ఒకే రాయిపై నాలుగు దిక్కుల్లో నిలిచి.. పూజలందుకుంటున్నారు. సమీపంలోనే మత్స్య యంత్రమూ ప్రతిష్టించారు.

శైవాలయాలకు ఆధ్యాత్మిక శోభ.. దీపాలతో వెలుగులీనుతున్న తెలంగాణ

Nainpaka Temple Story: చారిత్రక ప్రాధాన్యమున్న ఈ ఆలయం అంతులేని నిర్లక్ష్యానికి నిరాదారణకు గురవుతోంది. శిధిలావస్ధకు చేరుతున్నా.. ఇటు దేవాదాయ అటు పురావస్తు శాఖ అధికారులు(Archaeological Department officials) పట్టించుకోవట్లేదని భక్తులు చెబుతున్నారు. ఆలయం పైభాగాన గడ్డి, మొక్కలు మొలుస్తున్నా పట్టించుకునేవారే కరవైతున్నారు. ఆలయ గోపురం వర్షానికి కొంతమేర కూలిపోయినా పునురుద్ధరించలేదని తెలిపారు. ఆలయ విశిష్టతను తెలుసుకుని అప్పటి స్పీకర్ మధుసూదనాచారి దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారించి రూ.3.30 కోట్లు మంజూరు చేయించారు. 2018 ఏప్రిల్లో ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభించినా.. గుత్తేదారు జాగ్రత్తలు తీసుకోకుండా దిమ్మెల నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో.. ఆలయానికి ముప్పు వాటిల్లుతుందని పురావస్తు శాఖ అధికారులు పనులు నిలిపివేయించారు. ఐదేళ్లవుతున్నా.. పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదని అన్నారు. ఆలయ భూములూ కబ్డాకు గురవౌతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

"దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ నైనపాకలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఈ దేవాలయాన్ని అమెరికా ప్రోపెసర్​ దర్శనం చేసుకున్నారు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం అధికారులు నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. గుడికి సంబంధించిన భూములు కూడా కబ్జా అయ్యాయి. ఈ భూములు అధికారులు సర్వే చేయించి.. ఆలయానికి చెంద్లేలా చేయాలని విజ్ఞాప్తి చేస్తున్నాం. ఈ దేవాలయం పనులు త్వరగా పూర్తి చేసి.. భక్తులకి సౌకర్య వంతంగా ఉండేలా చేయాలని కోరుతున్నాను." - ప్రభాకర ఆచార్యులు, దేవాలయ అర్చకులు

Lakshmi Narasimha Swamy Temple in Bhupalpally: నలుగురు దేవతామూర్తులు ఉండడంతో.. ప్రతి ఏడాది నాలుగు సార్లు జాతరలు, జరుగుతాయి. గోపురం పాక్షికంగా కూలడంతో.. వర్షం కారణంగా జాతరల్లో స్వామి అమ్మవార్ల కల్యాణం చేయడానికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి. భక్తులు కనీసం కాళ్లు కడుక్కుని.. స్వామి దర్శనం(Swami Darsanam) చేసుకునేందుకు కూడా సరైన ఏర్పాట్లు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ పురావస్తు అధికారుల మధ్య సమన్వయ లేమి ఆలయ అభివృద్ధికి శాపంగా మారుతోంది. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి.. ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Devotional day in Telangana : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు 'ఆధ్యాత్మిక దినోత్సవం'

Telangana Secretariat Temples Inauguration : సచివాలయంలో ప్రార్థనా మందిరాలు ప్రారంభం.. 3 మతాల వారికి ప్రాధాన్యం దక్కిందన్న కేసీఆర్

యాదాద్రి ఆలయంలో లక్ష పుష్పార్చన పూజలు

ABOUT THE AUTHOR

...view details