తెలంగాణ

telangana

కాళేశ్వరంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

By

Published : Dec 25, 2020, 11:40 AM IST

తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చన అనంతరం ఉత్తర ద్వారం ద్వారా భక్తులుకు దర్శనం కలిపించారు. శ్రీ సీతారమ చంద్రముర్తిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులికించిపోయారు.

ముక్కోటి ఏకాదశి వేడుకలు
mukkoti Ekadashi

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామున నుంచే భక్తులు ఆలయం వద్ద భారీగా వరుసలు కట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అర్చకులు శాస్త్రోక్తంగా ఉత్తర వైకుంఠ ద్వారాన్ని తెరిచారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనందంతో పులికించిపోయారు.

మహదేవపూర్​లోని మందరగిరి స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సైతం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ఘనంగా జరిపారు. మూలవిరట్టుకు పంచామృత అభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులుకు దర్శనం కలిపించారు. స్వామి వారి తీర్థ,ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండి:తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details