తెలంగాణ

telangana

నూతన ఆస్పత్రిలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ

By

Published : Mar 17, 2021, 8:29 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని.. ప్రగతి భవన్ నుంచి ఏరియా దవాఖానాకు మార్చాలని ఆదేశించారు. ఈ నెలలో లాప్స్ అవుతున్న నిధులుంటే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

నూతన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ
నూతన ఆస్పత్రిని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం మంజూర్​ నగర్​లో కొత్తగా నిర్మించిన ఆస్పత్రిని ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశించారు.

ట్రయల్​రన్ బేసిస్​లో..

జిల్లా కేంద్రంలో నూతన ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీసీహెచ్ఎస్ డా.తిరుపతి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.జె.సుధార్ సింగ్​తో శాఖల పనితీరు, ప్రజలకు అందాల్సిన సేవలపై సమీక్షించారు. దవాఖానాను ప్రస్తుతానికి ట్రయల్​రన్ బేసిస్​లో వినియోగంలోకి తెస్తామని తెలిపారు.

వెనక్కి రప్పించాలి..

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్ట్​లు, లాబ్ టెక్నిషియన్స్, ఇతర క్యాడర్లకు చెందిన హెచ్ఆర్​ను సమకూరుస్తానని పేర్కొన్నారు. డిప్యుటేషన్లలో ఉన్న ఉద్యోగులను వెనక్కి రప్పించాలని ఆదేశించారు. లేదంటే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సద్వినియోగం చేసుకోవాలి..

అందరు జవాబుదారీగా ఉండాలని, మందులు తప్పకుండా ఈ ఔషది పోర్టల్​లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఈ నెలలో లాప్స్ అవుతున్న నిధులుంటే సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆస్పత్రిలో డి.ఎం.హెచ్.ఓ కార్యాలయం తనిఖీ చేశారు. జిల్లా ఫార్మసీ స్టోర్​లో రికార్డ్స్​ పరిశీలించారు.

ఏరియా దవాఖానాలో క్రిటమిన్, రాండం బ్లడ్ షుగర్ పరీక్షలు కలెక్టర్ చేయించుకున్నారు. ఆయన వెంట సీపీఓ కె.శామ్యూల్, డీపీఆర్ఓ రవికుమార్, డా.మమతాదేవి, డా.ఉమాదేవి, హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్, డీడీఎం మధుబాబు ఉన్నారు.

ఇదీ చూడండి:గ్రామాల్లో పర్యటిస్తూ... సమస్యల గురించి తెలుసుకుంటూ

TAGGED:

ABOUT THE AUTHOR

...view details