తెలంగాణ

telangana

'ఆదాయం కోసం ధరలు పెంచడం ఒక్కటే మార్గమా?'

By

Published : Mar 26, 2022, 3:09 PM IST

MLC Jeevan reddy on Charges Hike: ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెరాస, భాజపాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్రం ఆదాయం కోసం ధరలు పెంచడం ఒక్కటే మార్గంగా చూస్తోందని విమర్శించారు. చమురు ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతోందని మండిపడ్డారు.

mlc jeevan reddy
ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి

MLC Jeevan reddy on Charges Hike: తెరాస, భాజపా కలిసి రైతుల సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకు ధర్నాలు చేస్తున్నాయని విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన జీవన్​ రెడ్డి.. ధరల పెంపును వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇరు ప్రభుత్వాలు తోడుదొంగలాట ఆపి.. ప్రజలపై మోపిన పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్​ శాఖకు పడిన బకాయి రూ. 12 వేల కోట్లు చెల్లించలేక.. విద్యుత్​ ఛార్జీలు పెంచింది. ముందుగా ప్రభుత్వం బకాయి సొమ్ము చెల్లించి విద్యుత్​ ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలి. 2014లో పెట్రోలుపై 14 శాతం పన్ను ఉంటే.. 35 శాతం పెంచారు. డీజిల్​పై 12.50 శాతం ఉన్న పన్నును 27 శాతానికి పెంచారు. ప్రజలపై పన్నుల భారాన్ని మోపి ధర్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.-జీవన్​ రెడ్డి, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ

కేంద్రం ఆదాయం పెంచడం కోసం ధరలు పెంచడం ఒక్కటే మార్గమా అని జీవన్​ రెడ్డి ప్రశ్నించారు. ఆదాయం కోసం విదేశాల్లోని నల్లధనం తీసుకురావొచ్చు కదా అని సూచించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయని.. కార్పొరేట్‌ ట్యాక్స్‌, వ్యాట్‌ను విపరీతంగా పెంచాయని మండిపడ్డారు. రూ.450 గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యికి పైగా పెంచారని.. గతంలో కేంద్రం రూ.50 పెంచితే వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం ఆ భారాన్ని భరించిందని గుర్తు చేశారు.

ఆదాయం కోసం విదేశాల్లోని నల్లధనం తీసుకురావొచ్చు కదా: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఇదీ చదవండి:Congress Protest: పోరాటానికి కాంగ్రెస్ సిద్ధం.. టీపీసీసీ సమావేశంలో కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details