తెలంగాణ

telangana

కోరుట్లలో కొవిడ్‌తో ఆరు నెలల గర్భిణీ మృతి

By

Published : Apr 16, 2021, 1:42 PM IST

Updated : Apr 16, 2021, 2:08 PM IST

corona
కరోనా

13:38 April 16

కోరుట్లలో కొవిడ్‌తో ఆరు నెలల గర్భిణీ మృతి

రాష్ట్రంలో కరోనా శరవేగంగా విజృంభిస్తోంది. కొవిడ్​తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ గర్భిణీ కొవిడ్‌తో మృతి చెందారు. మిషన్ భగీరథ కోరుట్ల ఏఈగా పని చేస్తున్న రోహిణి 8 రోజుల క్రితం జ్వరంతో ఆస్పత్రికి వెళ్లారు.  

పరీక్షల్లో ఆమె కొవిడ్ పాజిటివ్ నిర్ధరణయింది. అప్పటికే ఊపిరితిత్తులు చెడిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భంతో ఉన్నారు. రోహిణికి రెండేళ్ల పాప కూడా ఉంది.  

ఇదీ చదవండి:లైవ్ వీడియో- చేపల వేటకు వెళ్లి నీటిలో గల్లంతైన వ్యక్తి

Last Updated : Apr 16, 2021, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details