తెలంగాణ

telangana

జగిత్యాల యువకుడి అరుదైన రికార్డు.. అమెరికా పర్వతంపై సూర్యనమస్కారాలు

By

Published : Jun 7, 2021, 6:35 AM IST

జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామానికి చెందిన యువకుడు అరుదైన రికార్డు సాధించారు. అమెరికాలోని ఓ పర్వతం అధిరోహించి సూర్యనమస్కారాలు చేశారు. యోగా ప్రత్యేకతను ప్రపంచానికి చాటడానికే ఇలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

yogasanam
yogasanam

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన మరిపెళ్లి ప్రవీణ్ అనే యువకుడు అరుదైన రికార్డు సాధించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని 1,458 మీటర్లు ఎత్తులో ఉన్న బ్రాస్ టౌన్ బాల్డ్ పర్వతాన్ని 23 నిమిషాల్లో అధిరోహించారు. అనంతరం 108 సూర్యనమస్కారాలు చేశారు.

గతంలోనూ గడ్డకట్టిన సరస్సుపై సూర్యనమస్కారాలు చేస్తూ అందరిని ఆకర్షించారు. యోగా ప్రత్యేకతను ప్రపంచానికి చాటేందుకు ఇప్పటి వరకు 11 ఎత్తైన పర్వతాలపై సూర్యనమస్కారాలు చేసినట్లు వెల్లడించారు. పలు అవార్డులను సొంతం చేసుకున్నారు.

ఇదీ చదవండి:Lockdown : సాయంత్రం 5 గంటల వరకు లాక్​డౌన్ సడలింపు?

ABOUT THE AUTHOR

...view details