తెలంగాణ

telangana

6th Phase Green India Challenge : 'ఆరో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో ప్లాస్టిక్‌ నివారణ దిశగా అడుగులు'

By

Published : Jul 15, 2023, 7:55 PM IST

Updated : Jul 15, 2023, 8:12 PM IST

MP SanthoshKumar on Green India Challenge : ఆరో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్లాస్టిక్‌ను నివారించే దిశగా అడుగులు వేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోశ్​కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నామని చెప్పారు. 1094 ఎకరాల అటవీ భూమిని అభివృద్ధి చేస్తామని సంతోశ్​​కుమార్ వివరించారు.

MP SanthoshKumar
MP SanthoshKumar

MP SanthoshKumar Started 6th Phase Green India Challenge :మూడు మొక్కలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. ఐదేళ్లు పూర్తి చేసుకొని ఇప్పుడు లక్షల మొక్కలతో ఆరో వసంతంలోకి అడుగుపెట్టిందని ఎంపీ జోగినపల్లి సంతోశ్​కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్​లో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్‎, సీఎస్ శాంతి కుమారి, స్థానిక శాసన సభ్యులు సుంకె రవిశంకర్​లతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో సంతోశ్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తొలి దశలో కొడిమ్యాల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో మొత్తం.. 1,094 ఎకరాల అటవీ భూమిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లోభాగంగా దత్తత తీసుకుంటున్నట్లు సంతోశ్​​కుమార్ ప్రకటించారు. ఆరో విడతలో పచ్చదనం పెంపు, ప్లాస్టిక్ కాలుష్యం, నియంత్రణ, అవగాహనపై కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికీ సంతోశ్ ధన్యవాదాలు తెలిపారు.

"గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఐదేళ్లు పూర్తి చేసుకొని ఇప్పుడు.. లక్షల మొక్కలతో ఆరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్కలు నాటడమే కాక.. ప్లాస్టిక్‌ను నివారించే దిశగా అడుగులు వేస్తాం. ఇందుకోసం మావంతు ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు." - జోగినపల్లి సంతోశ్​​కుమార్, ఎంపీ

ఆరో వసంతంలోకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్

SanthoshKumar Adopted Kondagattu Forest Area : కొండగట్టు దేవాలయాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేందుకు.. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.ఎంపీ సంతోశ్​కుమార్.. రూ.1.4 కోట్లతో కొండగట్టు అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 265 కోట్ల మొక్కలను నాటామని వివరించారు. దీంతో అన్ని పల్లెలు, పట్టణాలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు.

SanthoshKumar on Green India Challenge : మరోవైపు కొండగట్టు వద్ద ఎంపీ సంతోశ్​​కుమార్‌ హరితహారం సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం.. భక్తులకు ఆగ్రహం తెప్పించింది. ఎంపీతో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్ వస్తున్నారన్న సమాచారంతో.. ఉదయం 9 గంటల నుంచే అధికారులు దర్శనాలు నిలిపివేశారు. ఈ క్రమంలోనే ప్రజాప్రతినిధులు దాదాపు రెండు గంటల తర్వాత ఆలయానికి చేరుకున్నారు. మరోవైపు భక్తుల వాహనాలను గుట్ట వద్దకు అనుమతించకపోవడంతో.. వారు పిల్లాపాపలతో దాదాపు రెండు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దర్శనం అనంతరం నాచుపల్లి మార్గంలో హరితహారం కార్యక్రమానికి ఎంపీ సంతోశ్​కుమార్ హాజరయ్యారు. దీంతో పోలీసులు ఆ మార్గంలో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం టిఫిన్లు చేయకుండా వచ్చామని.. ఎన్ని గంటలు ఇలా రోడ్డుపై వేచి ఉండాలని వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో భక్తులను అనుమతించడంతో చిన్న పిల్లలతో కాలినడకన వాహనాల వద్దకు చేరుకున్నారు.

ఇవీ చదవండి:Kapil Sharma Green India Challenge : గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో కపిల్ శర్మ

లిమ్కా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లో 'గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​'

Last Updated : Jul 15, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details