తెలంగాణ

telangana

సర్వమత సమగ్రతను చాటుకున్న జగిత్యాల కలెక్టర్ యాస్మిన్​ బాషా

By

Published : Mar 5, 2023, 3:06 PM IST

District Collector of Jagityala: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా సర్వమత సమగ్రతను చాటుకున్నారు. అర్చకుల సూచనలను అనుసరించి నుదట తిలకం పెట్టుకుని తలపాగ చుట్టుకుని గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను ధర్మపురి నరసింహస్వామికి సమర్పించారు.

జగిత్యాల కలెక్టర్ యాస్మిన్​భాషా
జగిత్యాల కలెక్టర్ యాస్మిన్​భాషా

District Collector of Jagityala: జగిత్యాల జిల్లా కలెక్టర్​గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన యాస్మిన్ బాషా ఐఏఎస్ ఆఫీసర్​గా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉన్న ఆమె తొలుత రాజన్న సిరిసిల్ల జిల్లాలో అదనపు కలెక్టర్​గా కూడా పనిచేశారు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో క్షేత్రంలో భక్తుల కోసం నిర్వహించే ఏర్పాట్ల విషయంలో కూడా సమావేశం నిర్వహించారు. అప్పుడు ఆలయ అధికారులు దేవాదాయ శాఖ సాంప్రదాయం ప్రకారం కలెక్టర్ యాస్మిన్ బాషకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు జరపడంతో పాటు స్వామి వారి ఆశీర్వచనాలను కూడా తీసుకుని ఆదర్శప్రాయంగా నిలిచారు.

Yasmin Bhasha showed integrity of all religions: ఇతర మతాలకు చెందిన అధికారులు అయితే ఆలయంలో ఏర్పాట్ల గురించి విధులు నిర్వర్తించినా గర్భాలయంలోకి మాత్రం వెళ్లేందుకు సాహసించేవారు కాదు. ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి వచ్చిన బొట్టు, పూజ వంటి కార్యక్రమాలకు దూరం పాటించేవారు. కానీ జగిత్యాల కలెక్టర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించి ఐఏఎస్ అధికారి హోదాలో సర్వమత సమగ్రతను చాటుకున్నారు. తాజాగా ధర్మపురి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి ప్రభుత్వం తరపున అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంది.

ఈ ఉత్సవాలకు హాజరైన కలెక్టర్ యాస్మిన్ బాషా వేద పండితుల సూచనలను అనుసరించి నుదట తిలకం పెట్టుకుని తలపాగ చుట్టుకుని గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పట్టు వస్త్రాలను, తలంబ్రాలను ధర్మపురి నరసింహస్వామికి సమర్పించారు. అలాగే స్వామి వారికి పూజలు కూడా నిర్వహించిన అనంతరం ఆమె తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు.

అర్చకుల మంత్రోఛ్ఛారణల మధ్య యాస్మిన్ బాష జిల్లా కలెక్టర్​గా తాను నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని నిర్వహించి అరుదైన అధికారిణిగా గుర్తింపు పొందారని చెప్పవచ్చు. కొండగట్టులోను దేవస్థానంలోను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు అంజన్న సన్నిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వెంట వచ్చిన జగిత్యాల జిల్లా కలెక్టర్ హోదాలో యాస్మీన్ బాషా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేశారు. అంజన్న బొట్టు తన కంఠంపై పెట్టుకుని మరీ ఆలయ అభివృద్దిపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

సర్వమత సమగ్రతను చాటుకున్న జగిత్యాల కలెక్టర్ యాస్మిన్​భాషా

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details