తెలంగాణ

telangana

'బతుకమ్మ చీరను పుట్టింటి కానుకగా చూడాలే కానీ వెలకట్టకూడదు'

By

Published : Oct 12, 2020, 7:20 PM IST

రాష్ట్ర ఆడపడుచులకు దసరా పండుగ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పుట్టింటి కానుక బతుకమ్మ చీర అని స్టేషన్​ఘన​పూర్ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. జగిత్యాల జిల్లా చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

bathukamma-sarees-distribution-by-mla-rajaiah-at-station-ghanpur-in-jagtial-district
'బతుకమ్మ చీరను పుట్టింటి కానుకగా చూడాలే కానీ వెలకట్టకూడదు'

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలను మహిళలు పుట్టింటి కానుకగా భావించాలని.. దాని విలువ చూడకూడదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. జగిత్యాల జిల్లా చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మహిళలు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు కళాకారులతో కలిసి డప్పు వాయించి కళాకారులను ఉత్సాహపరిచారు.

అనంతరం ప్రభుత్వం సబ్సిడీకి అందిస్తున్న చేపపిల్లలను చెరువుల్లో విడుదల చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కోట్ల 66 లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇదీ చూడండి:బతుకమ్మ చీరలు ఆడబిడ్డలకు కానుక : మంత్రి అల్లోల

TAGGED:

ABOUT THE AUTHOR

...view details