తెలంగాణ

telangana

హక్కులను ఉల్లంఘిస్తున్న పోలీసులపై కేసు పెడతాం: షర్మిల

By

Published : Dec 14, 2022, 2:26 PM IST

YSRTP President Sharmila: హక్కులను ఉల్లంఘిస్తున్న పోలీసులపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వైఎస్​ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రకటించారు. తాను పాదయాత్ర చేస్తే అడుగడునా పోలీసులతో అడ్డుకుంటున్నారని.. వాహనాన్ని దగ్దం చేశారని ఆరోపించారు. కోర్టుకు వెళతానంటే కూడా వెళ్లనివ్వకుండా, వ్యక్తిగత పనులు కూడా చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే పోలీసులపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. మహిళ అయి ఉండి ఎమ్మెల్సీ కవిత లిక్కర్ మాఫియాతో కోట్లు సంపాదించారని ఆరోపించారు.

Sharmila
షర్మిల

YSRTP President Sharmila: తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్‌కు దేవుడని.. మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తెలంగాణలో కేసీఆర్ పార్టీ పెట్టారని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణ మీద ప్రేమతో నినాదం ఎత్తుకోలేదని.. మంత్రి పదవి దక్కకపోవడంతోనే తెలంగాణలలో పార్టీ పెట్టారన్నారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. తాను పాదయాత్ర చేస్తే అడుగడునా పోలీసులతో అడ్డుకుంటున్నారని.. పాదయాత్రలో తన వాహనాన్ని దగ్దం చేశారని ఆరోపించారు.

కనీసం కోర్టుకు వెళతానన్న కూడా వెళ్లనీయకుండా వ్యక్తిగత పనులు కూడా చేసుకోకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే పోలీసులపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. కవిత మహిళ అయి ఉండి లిక్కర్ మాఫియాతో కోట్లు సంపాదించిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో ఉండి కవిత తెలంగాణ పరువు తీసిందని ధ్వజమెత్తారు. లిక్కర్‌, భూమాఫియా వంటి అన్ని మాఫియాలు కేసీఆర్ కుటుంబమే చేసిందని విమర్శించారు.

"నేను పాదయాత్ర చేస్తే అడుగడునా పోలీసులతో అడ్డుకుంటున్నారు. పాదయాత్రలో నా వాహనాన్ని దగ్ధం చేశారు. కనీసం కోర్టుకు వెళతానన్న కూడా వెళ్లనీయకుండా అడ్డుపడుతున్నారు. వ్యక్తిగత పనులు కూడా చేసుకోకుండా పోలీసులు భంగం కలిగిస్తున్నారు. అందుకే పోలీసులపై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నాను."- వైఎస్ షర్మిల, తెలంగాణ వైటీపీ అధ్యక్షురాలు

హక్కులను ఉల్లంఘిస్తున్న పోలీసులపై కేసు పెడుతాం: షర్మిల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details