తెలంగాణ

telangana

కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు: షర్మిల

By

Published : Dec 10, 2022, 12:32 PM IST

YS Sharmila Fires On kCR: తన పాదయాత్రకు అనుమతివ్వాలంటూ వైఎస్ షర్మిల చేస్తున్న నిరహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేసీఆర్​పై షర్మిల విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ అవినీతి గురించి మాట్లాడితే దాడులా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అప్పుల కుప్పగా మార్చారని షర్మిల విమర్శించారు.

YS Sharmila Fires On kCR
YS Sharmila Fires On kCR

YS Sharmila Fires On kCR: కేసీఆర్ ప్రభుత్వం నియంతలా వ్యవహారిస్తోందని వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అర్‌ఎస్‌ఎస్​ను బీజేపీ, పోలీసులను బీఆర్‌ఎస్‌ వాడుకుంటుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతలు తనపై వ్యక్తిగత దూషణలు.. వ్యక్తిగత దాడులకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. తన పాదయాత్రకు అనుమతివ్వాలంటూ షర్మిల చేస్తున్న రెండో రోజూ నిరహార దీక్షలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

అప్పుల కుప్పగా మార్చారు:కేసీఆర్‌ అవినీతి గురించి మాట్లాడితే దాడులా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. తనను శిఖండి అని దూషించిన మంత్రి సత్యవతి రాఠోడ్​ను.. శూర్పణఖ అంటే ఎలా ఉంటుందని షర్మిల ప్రశ్నించారు. దీక్ష స్థలం వద్ద కర్ఫ్యూను తలపిస్తుందని.. తక్షణమే పోలీసులు అక్కడి నుంచి తరలించాలన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై పాత కేసులను బనాయిస్తున్నారని షర్మిల విమర్శించారు.

తన యాత్రకు అనుమతితో పాటు.. అరెస్ట్ చేసిన కార్యకర్తలను విడుదల చేసే వరకు దీక్ష విరమించేదిలేదని షర్మిల తెలిపారు. షర్మిలకు మద్దతుగా వైఎస్ విజయమ్మ దీక్షలో కూర్చున్నారు. మరోవైపు ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా లోటస్‌పాండ్‌కు చేరుకున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి 40మంది కార్యకర్తలు బొల్లారం పోలీస్​స్టేషన్​లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ నేత ఏపూరి సోమన్న స్వల్ప అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు. బంజారాహిల్స్‌ పీఎస్​లో మరికొందరు నేతలు పోలీసుల అదుపులో ఉన్నారు.

"కేసీఆర్ నియంత అని మళ్లీ నిరూపించుకున్నారు. న్యాయస్థానం చెప్పింది పాదయాత్ర చేసుకోమని చెప్పింది. కేసీఆర్ పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రకు అనుమతి లేదని చెప్పించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ఎందుకు మీ కక్ష. పోలీసులను బీఆర్ఎస్​ కోసం వాడుకుంటున్నారు. టీఆర్​ఎస్​లో ఉన్న ఉద్యమకారులందరిని వెళ్లగొట్టారు. ఇప్పుడు బీఆర్ఎస్​ పెట్టి దేశాన్ని లూటీ చేయడానికి పోతున్నారు. మా పాదయాత్రకు అనుమతివ్వాలి.అరెస్ట్ చేసిన మా కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - వైఎస్ షర్మిల, వైఎస్సాఆర్​టీపీ అధ్యక్షురాలు

ఇవీ చదవండి:వైఎస్​ షర్మిల నిరాహారదీక్ష.. మద్దతు తెలిపిన తల్లి విజయమ్మ

తమిళనాడులో మాండౌస్​ తుపాను బీభత్సం రహదారులు జలమయం

ABOUT THE AUTHOR

...view details