తెలంగాణ

telangana

Young Man committed suicide in Secunderabad : ఫోన్​ పోయిందని.. ప్రాణం తీసుకున్నాడు

By

Published : Jun 5, 2023, 6:59 PM IST

Young Man committed suicide because his phone lost : తండ్రి కొనిచ్చిన సెల్​ఫోన్​ పోయిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు అతని అన్నకి ఫోన్​ చేసి అమ్మనాన్నలని బాగా చూసుకోమని చెప్పాడు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది.

Etv Bharat
Etv Bharat

Young Man committed suicide Borabanda : మొదటిసారి ఫోన్​ పోయినందున.. మరో మొబైల్​ తండ్రి ద్వారా కొనుకున్నాడు. అది కూడా పోయిందని మనస్తాపానికి గురై.. తన వల్ల తండ్రికి సమస్యలు వస్తున్నాయని.. ఓ యువకుడు భావించాడు. చివరిగా తన అన్నకి కాల్​ చేసి తాను చనిపోతున్నట్లు చెప్పి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లో జరిగింది.

పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండ రాజ్​నగర్​కు చెందిన చుక్కా శ్రీనివాస్ పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానాలో వార్డుబాయ్​గా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు చుక్కా సాయికుమార్ (21) పద్మారావునగర్​లోని సర్దార్ పటేల్ కళాశాలలో బీకామ్ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతూ.. పార్ట్ టైమ్ డెలవరీ బాయ్​గా పనిచేస్తున్నాడు. నెల రోజుల కిందట అతడు స్థానిక పార్కుకు వెళ్తున్న సమయంలో.. తన సెల్​ఫోన్​ పోయింది. దీంతో ఈఎంఐ పద్దతిలో రూ.28 వేల విలువ చేసే మరో ఫోన్ అతని తండ్రి కొన్నాడు.

శుక్రవారం రోజున బాధితుడు ఉన్న బస్తీలో వాటర్ క్యాన్ తీసుకు వస్తున్న సమయంలో.. జేబులో ఉన్న ఫోన్ రోడ్డుపై పడిపోయింది. రెండో ఫోన్ కూడా పోగొట్టుకున్న విషయం తండ్రికి చెప్పాడు. కొద్ది రోజుల్లో మరో ఫోన్ ఇప్పిస్తానంటూ నచ్చజెప్పాడు. శనివారం ఉదయం మిత్రులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్​కి వెళ్లి.. తన సెల్ ఫోన్ పోయిందని అక్కడి పోలీసు సిబ్బందికి చెప్పాడు. దీంతో పోలీస్​ సిబ్బంది ఈ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే మిత్రులతో కలిసి ఈ సేవ కేంద్రంలో ఫిర్యాదు చేసి.. తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

ఫోన్​లో ఏమి మాట్లాడాడు : అదే రోజు సాయంత్రం తన అన్న వినోద్​ కుమార్​కు ఫోన్​ చేశాడు. తన వల్ల నాన్నకి సమస్యలు వస్తున్నాయని.. అమ్మనాన్నలను బాగా చూసుకోమని.. తాను రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి ఫోన్ కట్​ చేశాడు. ఈ విషయం విన్న కుటుంబ సభ్యులు నగరంలోని అన్ని రైల్వే స్టేషన్​లు వెతికారు. ఎక్కడా తన సాయి కనిపించలేదు. దీంతో సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

రైల్వే పట్టాలపై మృతదేహాం :ఆదివారం రైల్వే సిబ్బందికి తుకారం రైల్వేగేట్​ దగ్గర ట్రాక్​పై గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే ఫిర్యాదు ఇచ్చిన శ్రీనివాస్​కి ఫోన్​ చేశారు. వచ్చిన తరవాత ఆ మృతదేహాం తన కుమారుడిదిగా గుర్తించాడు. దీంతో సికింద్రాబాద్​ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details