తెలంగాణ

telangana

ఇదేందయ్యా ఇది.. గోళీలకు కూడా పురుగులు పడతాయా?

By

Published : May 4, 2022, 3:05 PM IST

Worms in Tablets: బియ్యం, పప్పులకు పురుగుపట్టడం అప్పుడప్పుడు చూస్తుంటాం. కానీ ప్రభుత్వాసుపత్రిలో ఇచ్చిన మాత్రల్లోనూ పురుగులు కనిపించాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ వైఎస్సార్‌ జిల్లా బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో వెలుగుచూసింది.

insects in medicines
ఇదేందయ్యా ఇది.. గోళీలకు కూడా పురుగులు పడతాయా?

Worms in Tablets: రోగం వచ్చినప్పుడు మందులు వేసుకుంటే నయమవుతుంది.. కానీ ఆంధ్రప్రదేశ్​ వైఎస్​ఆర్​ జిల్లా బ్రహ్మంగారిమఠం ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన మందులు వేసుకుంటే ఉన్న ప్రాణాలు కాస్త పోయేటట్లు ఉన్నాయి. అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఎస్‌. మోహన్‌ జలుబు చేసిందని సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యుడు పరిశీలించి 6 మాత్రలు ఇచ్చారు. మోహన్‌ ఇంటికొచ్చాక తీసి వేసుకుందామని చూడగా.. మాత్రలోంచి చెద పురుగులాంటిది బయటికి వచ్చింది. భయపడి మరొకటి చూడగా.. అందులోనూ పురుగులు కనిపించాయి.

మంగళవారం మిగిలిన 4 మందుబిళ్లలను వైద్యుడి వద్దకు తీసుకెళ్లి చూపించారు. దీనిపై వైద్యుడు వెంకటనాగేంద్ర స్పందిస్తూ.. ‘మాత్రల్లో పురుగులు వచ్చిన మాట వాస్తవమే.. అవి కాలం తీరినవికావు. తయారీ లోపం వల్ల ఇలా జరిగింది. ఇకపై అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’ అని తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details