తెలంగాణ

telangana

'నా ప్రియుడితో మాట్లాడించండి.. లేదంటే చచ్చిపోతా'

By

Published : Dec 26, 2019, 8:48 AM IST

తనను ప్రేమించి... సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని... ఓ యువతి పోలీసుస్టేషన్​లో హల్​చల్​ చేసింది. తన ప్రియుడిని తెచ్చివ్వమని... లేదంటే సుసైడ్​ చేసుకుంటానని బెదిరించింది. ఈ ఘటన హైదరాబాద్​లోని బాచుపల్లి పీఎస్​లో చోటుచేసుకుంది.

women halchal in bachupalli ps for her lover
'నా ప్రియుడితో మాట్లాడించండి.. లేదంటే చచ్చిపోతా'

'నా ప్రియుడితో మాట్లాడించండి.. లేదంటే చచ్చిపోతా'

ఆంధ్రప్రదేశ్​ నెల్లూరుకు చెందిన అశ్విత తన కుటుంబంతో కలిసి హైదరాబాద్​లోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటుంది. బాచుపల్లిలో ఉండే చందు అనే వ్యక్తితో అశ్వితకు పబ్​లో పరిచయం ఏర్పడింది. అది కాస్త... ప్రేమగా మారి కొంత కాలం వీరిద్దరు సహజీవనం చేశారు.

ముఖం చాటేసిన ప్రియుడు...

ఈ మధ్య ప్రియుడు చందు అశ్వితకు ముఖం చాటేస్తు తప్పించుకు తిరిగుతున్నాడు. ఫోన్​లో కూడా అందుబాటులో లేకపోవడంతో విసిగిపోయిన అశ్విత ఇవాళ బాచుపల్లిలో చందు ఉండే నివాసానికి వెళ్లింది.

మాట్లాడించండి.. లేదంటే సుసైడ్​ చేసుకుంటా...

అక్కడ చందు లేకపోవడంతో కోపంతో ఉన్న అశ్విత బాచుపల్లి పీఎస్​కు వెళ్లి తన ప్రియుడిని తీసుకుని రావాలని హల్​చల్​ చేసింది. ప్రియుడితో 10 నిమిషాలు మాట్లాడించాలని లేదంటే పీఎస్​లోనే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది.

గతంలోనే యువతి ఇలాగే...

అశ్వితకు పోలీసులు ఎంత నచ్చచెప్పినా వినలేదు. చివరకు బాచుపల్లి సీఐ జగదీశ్వర్​ షీటీం వారిని పిలిపించి కౌన్సిలింగ్​ ఇప్పించాడు. అశ్విత అన్నను పీఎస్​కు పిలిపించి... ఆమెను అప్పజెప్పాడు. చందుని తీసుకురావడానికి ఫిర్యాదు రాసివ్వమంటే అశ్విత నిరాకరించింది. గతంలో కూడా రాయదుర్గం పీఎస్​లో ఇలానే హల్​చల్​ చేసిందని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: 5 ఎకరాల పొలం.. 23 రకాల పంటలు...

Intro:TG_Hyd_08_26_YUVATI HALCHAL_AV_TS10010

KUKATPALLY VIAHNU 9154945201

( )తనను ప్రేమించి సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, తన ప్రియుడిని తెచ్చివ్వమని, లేదంటే సుసైడ్ చేసుకుంటానని ఓ ప్రియురాలు పియస్ లో హల్చల్ చేసిన సంఘటన బాచుపల్లి పియస్ లో చోటుచేసుకుంది.

( ) నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విత తన కుటుంబంతో నగరంలోని చిత్రపురి కాలనీలో నివాసం ఉంటుంది. బాచుపల్లిలో నివాసం ఉండే చందూ అనే వ్యక్తితో అశ్వితకు పబ్ లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి కొంత కాలం వీరిద్దరు సహజీవనం చేసారు. ఈమద్య ప్రియుడు చందు అశ్విత పట్ల నిర్లక్ష్య ధోరణి అవలింబిస్తూ, ముఖం చాటేస్తు తప్పించుకు తిరుగు తున్నాడు. ఫోన్లో కూడ చందు అందుబాటులో రాకపోవడంతో విసిగి వేసారిన అశ్విత నేడు బాచుపల్లి లో చందు నివాసం ఉండే ఇంటికి వెళ్ళింది. అక్కడ చందు లేకపోవడంతో కోపంతో ఉన్న అశ్విత బాచుపల్లి పియస్ కు వెళ్ళి తన ప్రియుడుని తీసుకొని రావాలని పోలీసులను కోరింది. స్టేషన్ లో హల్చల్ చేసింది. ప్రియుడితో 10నిమిషాలు మాట్లాడి పీయాలని లేదంటే పియస్ లో సుసైడ్ చేసుకుంటానని పోలీసులను బెదిరించడంతో...అశ్వితకు పోలీసులు ఎంత నచ్చచెప్పిన వినకపోవడంతో బాచుపల్లి సిఐ జగదీశ్వర్ షీ టీం వారిని పిలిచి కౌంసిలింగ్ ఇప్పించాడు. అశ్విత అన్నను పియస్ కు పిలిచి ఆమెను అన్నకు అప్పచెప్పాడు. చందూని తీసుకరావడానికి కంప్లేంట్ రాసి ఇవ్వమంటే అశ్విత నిరాకరించింది. గతంలో కూడ అశ్విత రాయిదుర్గం పియస్ లో ఇలానే హల్చల్ చేసిందని తెలిసింది.Body:TG_Hyd_08_26_YUVATI HALCHAL_AV_TS10010Conclusion:TG_Hyd_08_26_YUVATI HALCHAL_AV_TS10010

ABOUT THE AUTHOR

...view details