తెలంగాణ

telangana

అర్వింద్​పై దాడి అనైతికం.. మూల్యం తప్పదు: బండి సంజయ్

By

Published : Jul 12, 2020, 6:41 PM IST

Updated : Jul 12, 2020, 8:29 PM IST

నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్​పై తెరాస శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఘటనపై ఫిర్యాదు చేయనున్నట్లు స్పష్టం చేశారు.

తెరాస దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : బండి సంజయ్
తెరాస దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : బండి సంజయ్

భాజపా కార్యాలయం, ఎంపీ అరవింద్‌పై దాడిని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తెరాస నేతలకు భాజపా భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. భాజపా సిద్ధాంతాలు ఉన్న పార్టీ అని... తెరాసకు మాత్రం ఎలాంటి సిద్ధాంతాలు లేవని సంజయ్ మండిపడ్డారు.

ఆ విషయం మరవొద్దు : బండి

దాడులతో ప్రతిపక్షాలను, భాజపాను కట్టడి చేద్దామనుకోవడం మూర్ఖత్వమని సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉందనే విషయం తెరాస మర్చిపోవద్దని సంజయ్‌ హెచ్చరించారు. భాజపా నేతలపై దాడి ఘటనపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

తెరాస దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం : బండి సంజయ్

ఇవీ చూడండి : 'రాష్ట్రానికి రూ.200 కోట్లు ఇచ్చాం... 2.40 లక్షల పీపీఈ కిట్లు అందించాం'

Last Updated :Jul 12, 2020, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details