తెలంగాణ

telangana

Venkaiah Naidu: 'వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్​ ఉంది'

By

Published : Dec 9, 2021, 6:19 AM IST

MS Swaminathan Awards Ceremony: వ్యవసాయ రంగాన్ని.. లాభసాటి, సుస్థిర, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. భారతదేశంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. రైతులకు సమయానుగుణంగా సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Venkaiah Naidu
Venkaiah Naidu

MS Swaminathan Awards Ceremony: సంప్రదాయ వ్యవసాయ విధానాలకు సాంకేతికతను జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ వ్యవసాయ రంగాన్ని లాభసాటి, సుస్థిర, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్​లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో విశ్రాంత ఐసీఏఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఎంఎస్ స్వామినాథన్ పురస్కార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావుకు.. ఎంఎస్​ స్వామినాథన్‌ పురస్కారాన్ని వెంకయ్య అందజేశారు. బిందు సేద్యం, సూక్ష్మ సాగు నీటి పద్ధతులను పాటించేలా రైతులకు మార్గనిర్దేశం చేస్తూ.. రైతులు పంట ఉత్పత్తులు పెంచుకునేలా చేయడంలో డాక్టర్ ప్రవీణ్‌రావు కృషిచేశారని అభినందించారు.

అద్భుతమైన భవిష్యత్తు ఉంది..

భారతదేశంలో వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా ఈ రంగానికి సరైన సమయంలో అవసరమైన చేయూత అందించడమని అన్నారు. రైతులకు సమయానుగుణంగా సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. తృణధాన్యాల ఉత్పత్తిని మెల్లిగా తగ్గిస్తూ పప్పుధాన్యాలు, నూనెగిజలు, సిరిధాన్యాల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలని నొక్కిచెప్పారు.

ఎంఎస్​ స్వామినాథన్‌ సేవలు చిరస్మరణీయం..

కీలక వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్‌కు గౌరవప్రదమైన స్థానం కల్పించే విషయంలో ప్రొఫెసర్ స్వామినాథన్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. స్వాతంత్య్రానంతరం వివిధ సమస్యలు ఎదుర్కొంటూ భారత వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. 1950-51లో 50.83 మిలియన్ టన్నులుగా ఉన్న భారతదేశ వ్యవసాయోత్పత్తి.. 2020-21 నాటికి 308.66 మిలియన్ టన్నులకు చేరిందని స్పష్టం చేశారు. అలాగే, పాలు, గుడ్లు, పండ్లు, కూరగాయలు ఇతర నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలోనూ భారతదేశం అవసరాలకు అనుగుణంగా పురోగతి కనబరుస్తోందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, విశ్రాంత ఐసీఏఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ ప్రసాద్, నూజివీడు సీడ్స్ అధినేత ఎం.ప్రభాకర్‌రావు, ఐసీఏఆర్ అనుబంధ సంస్థ అధిపతులు, వ్యవసాయ శాఖ అధికారులు, పలువురు విశ్రాంత శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:KCR letter to Modi: బొగ్గు వేలం ఆపేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ

ABOUT THE AUTHOR

...view details