తెలంగాణ

telangana

Kishan Reddy On Lockdown: సంక్రాంతి తరువాత లాక్​డౌన్​పై నిర్ణయం..

By

Published : Jan 10, 2022, 5:29 PM IST

Updated : Jan 10, 2022, 6:06 PM IST

Kishan Reddy On Lockdown
Kishan Reddy

Kishan Reddy On Lockdown: దేశంలో లాక్​డౌన్​ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్​డౌన్​ సహా ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Kishan Reddy On Lockdown: దేశంలో లాక్​డౌన్​పై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కీలకవ్యాఖ్యలు​

Kishan Reddy On Lockdown: దేశంలో లాక్​డౌన్​పై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లాక్​డౌన్​పై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​, ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేశారు. సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదని స్పష్టం చేశారు. త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని కిషన్​రెడ్డి చెప్పారు.

ఇవాళ సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. కొవిడ్‌ బూస్టర్​ డోస్​ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. దేశంలో కొవిడ్‌ మూడోవేవ్‌ ప్రభావం పెరిగిందన్న కిషన్‌రెడ్డి.. కరోనా టీకా తీసుకున్న వారికి ముప్పు లేదని చెప్పారు. టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించారు. 15 నుంచి 18 ఏళ్ల వయసున్న యువత దేశంలో 8 కోట్ల మంది ఉన్నారని.. వారిలో ఇప్పటికే 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ పూర్తయినట్లు చెప్పారు. దేశంలో 150 కోట్ల మంది ప్రజలకు వ్యాక్సినేషన్​ పూర్తైందన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాలైనా కొవిడ్ మెడిషన్, ఎక్విప్​మెంట్​ ఎగుమతులను నిలిపివేసినట్లు చెప్పారు.

'దేశంలో కొవిడ్‌ మూడోవేవ్‌ ప్రభావం పెరిగింది. కొవిడ్‌ టీకా తీసుకున్న వారికి ముప్పు లేదు. టీకాపై సామాజిక మాధ్యమాల్లోని పుకార్లు నమ్మొద్దు. ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదు. స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించవచ్చు. సంక్రాంతి తర్వాత పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది.'

- కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

ఇదీచూడండి:కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తత అనివార్యం: పవన్‌ కల్యాణ్

Last Updated :Jan 10, 2022, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details