తెలంగాణ

telangana

ఇంధన పొదుపులో ద్వితీయ స్థానం... టీఎస్​ఆర్టీసీకి అవార్డు!

By

Published : Jan 16, 2021, 8:28 PM IST

కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ, పీసీఆర్ఏలు 4,001 కంటే ఎక్కువ బస్సులు ఉన్న రవాణా సంస్థల కేటగిరీలో ఇంధన పొదుపులో టీఎస్​ఆర్టీసీ రెండో స్థానంలో నిలిచింది. 2020 ఏడాదికి డీజిల్​ పొదుపుతో రూ.18 కోట్లు ఆదా చేసిందని ఆర్టీసీ వెల్లడించింది.

tsrtc-second-place-in-fuel-saving-and-got-award-for-fuel-saving-in-2020
ఇంధన పొదుపులో ద్వితీయ స్థానం... టీఎస్​ఆర్టీసీకి అవార్డు!

టీఎస్ఆర్టీసీ జాతీయ స్థాయిలో ఇంధన పొదుపు సాధించి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర పెట్రోలియం సహజ వనరుల శాఖ, పీసీఆర్ఏలు 4,001 కంటే ఎక్కువ బస్సులున్న రవాణా సంస్థల కేటగిరీలో అవార్డు సొంతం చేసుకుంది. 2020వ సంవత్సరానికి ఇంధన వినియోగంలో 2.33 కేఎంపీఎల్ వృద్ధిని సాధించడం వల్ల 24 లక్షల లీటర్ల డీజిల్​ను పొదుపు చేసి... రూ.18 కోట్లు ఆదా చేశామని ఆర్టీసీ వెల్లడించింది. రోడ్డు, భవనాల శాఖ కార్యాలయంలో సాక్ష్యం-2021 పురస్కారంతో పాటు రూ.3లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ఆన్​లైన్​లో ఆర్టీసీ సీఎండీ సునీల్ శర్మ, ఈడీలకు అధికారులు అందజేశారు.

రాష్ట్ర స్థాయిలో ఇంధన పొదుపులో హయత్ నగర్-1, ఉప్పల్ డిపో, దిల్​సుఖ్​నగర్ డిపోలను ఉత్తమ డిపోలుగా గుర్తించారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వర్చువల్ సమావేశంలో ఈ డిపోలకు రూ.50వేల నగదు బహుమతిని, పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థలోని అధికారులు, ట్రాఫిక్ సూపర్​వైజర్లు, మెకానిక్ సూపర్​వైజర్లు, సూపరింటెండెంట్​లు, మెకానిక్​లు, డ్రైవర్లు, కండక్టర్లు, హెల్పర్​లు, కీలక పాత్ర పోషించిన అందరిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సీఎండీ సునీల్ శర్మ అభినందించారు.

ఇదీ చదవండి:సంక్రాంతి సంబురం... సింగపూర్​లో ఇంటింటా ఉత్సవం

ABOUT THE AUTHOR

...view details