తెలంగాణ

telangana

రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ నేత ఆయనే.. కేటీఆర్ కాదు: తెరాస ఎంపీలు

By

Published : Nov 7, 2022, 5:39 PM IST

TRS MPs fires on BJP: భాజపా నేతల వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు ఫైర్ అయ్యారు. మునుగోడు తీర్పు భారాస బలోపేతానికి బాటలు వేసిందని అన్నారు. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్ మాత్రమేనని కేటీఆర్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS MPs fires on bjp comments
TRS MPs fires on bjp comments

TRS MPs fires on BJP: తెలంగాణలో భాజపాకు ఆదరణ ఉండదని మునుగోడు ప్రజలు తేల్చి చెప్పారని తెరాస ఎంపీలు స్పష్టం చేశారు. మునుగోడు తీర్పు భారాస బలోపేతానికి బాటలు వేసిందని ఎంపీ వెంకటేశ్‌ నేత అన్నారు. బీఆర్‌ఎస్ దేశమంతా ఆదరణ లభిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌తో కలిసి మాట్లాడారు.

బీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకే మోదీ, అమిత్ షాలు మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని వెంకటేశ్‌ మండిపడ్డారు. భాజపా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చిందని ఆరోపించారు. బండి సంజయ్‌ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి వివేక్​కు లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వివేక్ డబ్బు, రాజకీయాలను మునుగోడు ప్రజలు తిరస్కరించారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్ మాత్రమేనని కేటీఆర్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులకు మునుగోడు గట్టి గుణపాఠం చెప్పిందని కవిత వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details