తెలంగాణ

telangana

'తెలంగాణకు కేసీఆర్​ బంధు అయితే.. రేవంత్ తాలిబన్'

By

Published : Feb 27, 2022, 4:30 PM IST

Updated : Feb 27, 2022, 7:03 PM IST

TRS MLA's on Revanth reddy : తెలంగాణకు సీఎం కేసీఆర్​ బంధు అయితే.. రేవంత్ తాలిబన్ అంటూ తెరాస నేతలు ఆరోపించారు. రేవంత్‌ రెడ్డికి విషం తప్పా.. విషయ పరిజ్ఞానంలేదని విమర్శించారు. రేవంత్‌ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని... ఖర్చులుంటే తాము భరిస్తామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.

TRS MLA's on Revanth reddy, trs leaders
రేవంత్​పై తెరాస నేతల ఆరోపణలు

TRS MLA's on Revanth reddy : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తెరాస నేతలు మండిపడ్డారు. పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో నీళ్లు, నిధులు, నియమాకాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌... రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్‌ను తక్షణమే ఎర్రగడ్డ మెంటల్‌ హాస్పిటల్‌లో చేర్పించాలని జగ్గారెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నామని... ఖర్చులుంటే తాము భరిస్తామని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు.

'తెలంగాణకు కేసీఆర్​ బంధు అయితే.. రేవంత్ తాలిబన్'

'మిషన్ భగీరథ అంటే రేవంత్ రెడ్డి... వేల కోట్ల అవినీతి అంటారు. మిషన్ కాకతీయ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే వేలకోట్ల అవినీతి అంటారు. కరోనా వ్యాక్సిన్ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. ఇంటర్ బోర్డు-పేపర్లు-ఎగ్జామ్ అంటే వేలకోట్ల అవినీతి అంటారు. కోకాపేట భూములు అంటే వేలకోట్ల అవినీతి అంటారు. ఈ వేలకోట్లు, అవినీతి అనేవి రేవంత్​కు ఊతపదాలుగా మారాయి. ఆయన మాట్లాడితే ఇవే వస్తాయి తప్పా... ఎన్నడూకూడా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడే మాటలు రావు.'

-బాల్క సుమన్, ప్రభుత్వ విప్

రేవంత్​పై ఆరోపణలు

రేవంత్‌ రెడ్డికి విషం తప్పా.. విషయ పరిజ్ఞానంలేదని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయనను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. భాజపాకు రేవంత్ రెడ్డి కోవర్టు అనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఆయనకు ఉరితాడు బిగించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు.

'మన ఊరు-మన పోరు అంటా. ఇదికాదు... మన పార్టీ-మన పోరు పెట్టుకుంటే ఫుల్​గా విజయవంతం అవుతుంది. భీమ్లా నాయక్ లెక్క సూపర్ హిట్ అవుతుంది. జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ వంటి వాళ్లతో కలిసి మన పార్టీ-మన పోరు కార్యక్రమాలు పెట్టుకోండి.'

-జీవన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే

'అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్​గా..'

అబద్దాలకు కేరాఫ్ అడ్రస్​గా రేవంత్ రెడ్డి మారిపోయారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ తెలంగాణకు బంధు అయితే... రేవంత్ తాలిబన్‌గా మారారని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి హుందాగా ఉంటే మంచిదని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ హితవు పలికారు. ఎవరిని అడిగినా రేవంత్ రెడ్డి బ్లాక్ మొయిలర్ అని చెబుతారని విమర్శించారు.

'రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండాలి. అబద్ధాలు మాట్లాడడం ఇకనైనా మానుకోవాలి. రేవంత్ గురించి ఎవరిని అడిగినా... బ్లాక్ మెయిలర్ అని చెబుతున్నారు.'

-మాగంటి గోపినాథ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:వారసత్వ కళల రక్షణ, ప్రోత్సహం కోసం హునర్‌ హాట్‌ : కిషన్ రెడ్డి

Last Updated : Feb 27, 2022, 7:03 PM IST

ABOUT THE AUTHOR

...view details