తెలంగాణ

telangana

Genco CMD: కరెంటు తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు చెప్పండి

By

Published : Jul 22, 2021, 9:21 PM IST

తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు చెప్పాలని సూచించారు.

Genco CMD
Genco CMD

రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. విద్యుత్‌ సిబ్బందికి ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు సీఎండీ పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్‌ సంస్థలతో 24 గంటల పాటు కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వెల్లడించారు.

పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంజినీర్లు, ఇతర సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని సీఎండీ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కరెంటు స్తంభాల తీగలు తెగిపడిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాలనీలు రహదారుల వెంబడి ఉన్న విద్యుత్ స్తంభాలను తాకవద్దని హెచ్చరించారు. నగరాలు, పట్టణాల్లో అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి నీరు చేరితే వెంటనే విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ఎస్పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ సంస్థల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్‌ స్తంభాలు, తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు చెప్పాలి. కాలనీలు, రోడ్ల పక్కనున్నవిద్యుత్ స్తంభాలను తాకవద్దు. సెల్లార్లలోకి నీరు చేరితే వెంటనే విద్యుత్ సిబ్బందికి చెప్పాలి.

-ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ

ఇదీ చూడండి:FLOOD REPORT: భారీగా చేరుతున్న వరద నీరు... నిండుకుండలా జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details