తెలంగాణ

telangana

ap cm jagan cases: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

By

Published : Aug 6, 2021, 7:57 PM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరింత సమయం కోరింది. పెన్నా ఛార్జ్‌షీట్ నుంచి పేరు తొలగించాలన్న జగన్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

jagan cbi
jagan cbi

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసు నుంచి తన పేరు తొలగించాలన్న జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. జగన్‌ డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇండియా సిమెంట్స్‌ కేసులో డిశ్ఛార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని జగన్‌, విజయసాయిరెడ్డి, శామ్యూల్‌ కోర్టుకు తెలిపారు.

పెన్నా కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్ఛార్జ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. పెన్నా, రఘురామ్‌, ఇండియా సిమెంట్స్‌ ఛార్జ్‌ షీట్ల విచారణ ఈనెల 13కి వాయిదా పడింది. ఈడీ కేసులు ఏ దశలో విచారణ జరపాలన్న అంశంపై హైకోర్టు తీర్పు రావాల్సి ఉందన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనతో ఈడీ కేసుల విచారణ ఈనెల 20కి వాయిదా పడింది.

ఇదీ చూడండి:RRR: 'ఆగస్టు 25న తప్పకుండా న్యాయం జరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details