తెలంగాణ

telangana

Hyderabad Traffic Alert : బేగంపేట పరిధిలో.. మూడు నెలల పాటు ట్రాఫిక్‌ మళ్లింపు

By

Published : Nov 23, 2022, 10:34 AM IST

Updated : Nov 23, 2022, 10:40 AM IST

Hyderabad

Hyderabad Traffic Alert : హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బేగంపేట పరిధిలో మూడు నెలలపాటు ట్రాఫిక్ మళ్లింపు ఉండనున్నట్లు తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ కింద రసూల్​పుర- రాంగోపాల్​పేట మధ్య నాలా పునరుద్ధరించనున్నందున ఈ మార్గంలో బుధవారం నుంచి మూడు నెలల పాటు ట్రాఫిక్​ మళ్లించనున్నట్లు వెల్లడించారు.

Traffic Diversion in Begumpet: వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ) కింద రసూల్‌పుర-రాంగోపాల్‌పేట ఠాణాల మధ్య రహదారి నాలా పునరుద్ధరించనున్న నేపథ్యంలో ఈ మార్గంలో బుధవారం నుంచి మూడు నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లించనున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుంచి 21వ తేదీ ఫిబ్రవరి 2023 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

మళ్లింపు ఇలా:

  • బేగంపేట ఫ్లైఓవర్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట, వీపీఎన్‌ఆర్‌ మార్గం వైపు వెళ్లేందుకు రసూల్‌పురా టి-జంక్షన్‌ వద్ద యూటర్న్‌ తీసుకునేందుకు అనుమతించరు. కిమ్స్‌ ఆసుపత్రి, మినిస్టర్‌ రోడ్‌, రాణిగంజ్‌, నల్లగుట్ట వైపు రసూల్‌పుర నుంచి వెళ్లే వాహనాలు సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకోవాలి. హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఫుడ్‌వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా, కిమ్స్‌ ఆసుపత్రుల వైపు వెళ్లొచ్చు.
  • రాణిగంజ్‌, నల్లగుట్ట, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే వాహనాలను రసూల్‌పుర వైపు అనుమతించరు. అటువైపుగా వచ్చే వాహనాలు రాంగోపాల్‌పేట ఠాణా, సింధికాలనీ, ఫుడ్‌వరల్డ్‌, హనుమాన్‌ టెంపుల్‌ మీదుగా వచ్చి ఎడమవైపు తీసుకుని రసూల్‌పుర వైపు వెళ్లే వీలుంది.
  • సికింద్రాబాద్‌ వైపు నుంచి కిమ్స్‌ ఆసుపత్రి వైపు వచ్చే వాహనాలు హనుమాన్‌ టెంపుల్‌ నుంచి ఎడమకు తీసుకుని, ఫుడ్‌ వరల్డ్‌, సింధీ కాలనీ, రాంగోపాల్‌పేట ఠాణా మీదుగా ఎడమకు మళ్లి కిమ్స్‌ వైపు వెళ్లవచ్చు. లేదా సీటీఓ ఫ్లైఓవర్‌ నుంచి ఎడమకు తీసుకుని రాణిగంజ్‌ మీదుగా వచ్చి కుడి వైపుగా కిమ్స్‌కు వెళ్లవచ్చు.
  • అంబులెన్స్‌లు లేదా రోగులను బేగంపేట ఫ్లైఓవర్‌ వైపు నుంచి కిమ్స్‌కు తీసుకువెళ్లాలంటే సీటీఓ ఫ్లైఓవర్‌ వరకు వెళ్లి యూటర్న్‌ తీసుకుని రాంగోపాల్‌పేట ఠాణా నుంచి కిమ్స్‌ వైపు వెళ్లేవీలుంది. భారీ వాహనాలు మినిస్టర్‌ రోడ్‌ వైపు వెళ్లాలంటే రాణిగంజ్‌ మార్గంలో రాకపోకలు సాగించాలి.


ఇవీ చదవండి:

Last Updated :Nov 23, 2022, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details