తెలంగాణ

telangana

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్ల ఖరారుకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

By

Published : Sep 28, 2022, 7:32 PM IST

Updated : Sep 28, 2022, 8:44 PM IST

High Court On KCR Nutrition Kits Tenders: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్లను ఖరారు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టెండరు నిబంధనల రూపకల్పనలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై ఈరోజు మరోసారి ఉన్నత న్యాయస్థానం విచారణ నిర్వహించింది. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు టెండరు ప్రక్రియ కొనసాగించి ఖరారు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

High Court on KCR nutrition kits tenders
High Court on KCR nutrition kits tenders

High Court On KCR Nutrition Kits Tenders: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్లను ఖరారు చేసేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. టెండరు ప్రక్రియ కొనసాగించవచ్చు కానీ.. ఖరారు చేయవద్దని ఇటీవల టీఎస్ఎంఐడీసీని ఆదేశించింది. అయితే టెండరు నిబంధనల రూపకల్పనలో అక్రమాలు జరిగాయన్న పిటిషన్లపై ఇవాళ మరోసారి ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. దసరా నాటికి గిరిజన ప్రాంతాల్లోని పేద మహిళలకు పౌష్టికాహారం కిట్లను అందివ్వాల్సి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టకు తెలిపారు.

ఒక కంపెనీకే కాంట్రాక్టు దక్కేలా టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించారని లాన్ ఈ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. టెండరు ప్రక్రియ కొనసాగించి ఖరారు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.. వివాదానికి సంబంధించిన అంశాలపై తర్వాత విచారణ చేపడతామని తెలిపింది.

అసలేం జరిగిదంటే: కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్లు ఒకే కంపెనీకి టెండరు దక్కేలా నిబంధనలు రూపొందించారని హైకోర్టులో లాన్ ఈ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రై.లి. పిటిషన్ వేసింది. మదర్ హార్లిక్స్ తయారీ సంస్థకు టెండరు దక్కేలా అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ప్రభుత్వం, టీఎస్ఎంఐడీసీ, హిందుస్థాన్ యునిలీవర్ ప్రై.లి.ను ప్రతివాదులుగా పిటిషన్​లో పేర్కొన్నారు.

Last Updated : Sep 28, 2022, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details