తెలంగాణ

telangana

Temperatures dropped in Hyderabad: రాబోయే రోజుల్లో చలి మరింత తీవ్రం.. హెచ్చరించిన ఐఎండీ..

By

Published : Dec 19, 2021, 12:53 PM IST

Updated : Dec 19, 2021, 1:06 PM IST

Temperatures dropped in Hyderabad : హైదరాబాద్​పై చలిపులి పంజా విసురుతోంది. సాయంత్రం అయిందంటే చాలు వణికిస్తోంది. శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.

Temperatures dropped in Hyderabad, clod intensity
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెరిగిన చలి తీవ్రత

Temperatures dropped in Hyderabad : హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత మరింత పెరిగింది. సాయంత్రం అయిందంటే గజగజ వణికిస్తోంది. శివారు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ఆదిలాబాద్‌లో కంటే హైదరాబాద్‌లోనే రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం గమనార్హం.

శ‌నివారంనాడు హైదరాబాద్​ వివిధ ప్రాంతాల్లో నమోదైన క‌నిష్ఠ ఉష్ణోగ్రతలు

  • ప‌టాన్‌చెరు- 8.4 డిగ్రీలు
  • రాజేంద్ర‌న‌గ‌ర్‌- 9 డిగ్రీలు
  • హ‌య‌త్ న‌గ‌ర్- 10 డిగ్రీలు

అందుకే పెరిగింది..

ఆదిలాబాద్‌లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త 10.4 డిగ్రీలుగా ఉంది. ఉత్త‌ర‌, ఈశాన్య ప్రాంతాల నుంచి శీత‌ల గాలులు రాష్ట్రంవైపు వీస్తుండ‌టంతో పొడి వాతావ‌ర‌ణం ఏర్ప‌డి... చ‌లి తీవ్ర‌త పెరిగింద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. మ‌రికొద్ది రోజుల పాటు చ‌లి తీవ్రత ఉంటుంద‌ని వెల్లడించారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌తో పాటు సిద్దిపేట‌, వ‌రంగ‌ల్ జిల్లాల‌కు ఆరెంజ్ హెచ్చ‌రిక‌ల‌ను జారీ చేశారు.

రాష్ట్రంలో ఇత‌ర ప్రాంతాల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు

  • ఆదిలాబాద్- 10.6
  • మెద‌క్- 10.8
  • హనుమకొండ - 13
  • హ‌కీంపేట- 13.5
  • రామగుండం- 13.4
  • నిజామాబాద్- 14.1
  • న‌ల్లొండ- 15
  • భ‌ద్రాచ‌లం- 15.4
  • మ‌హ‌బూబ్‌న‌గ‌ర్- 17.1

ఇదీ చదవండి:Temperatures dropped: గజగజ వణుకుతున్న తెలంగాణ.. నాలుగైదు రోజుల్లో మరింతగా!

Last Updated : Dec 19, 2021, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details