తెలంగాణ

telangana

'చలిగాలులు తగ్గాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి'

By

Published : Jan 26, 2021, 7:11 PM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం లేకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్లు హైదరాబాద్​ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.

జిల్లాలతో పాటు హైదరాబాద్​లోను ఉష్ణోగ్రతలు పెరిగాయి. పగటి సమయంలో ఉక్కపోతగాను.. రాత్రి వేళ చలి తీవ్రత తక్కువగా ఉంటుంది. ఈ ఏడాది పెద్దగా చలి ప్రభావం లేదని అధికారులు తెలిపారు. రాగల వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే విధంగా కొనసాగుతాయని వెల్లడించారు.

ఇదీ చూడండి:దిల్లీ రైతు ఉద్యమానికి మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details