తెలంగాణ

telangana

'అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు ఉంది'

By

Published : Nov 7, 2020, 8:43 PM IST

హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పాత్రను ప్రజలకు వివరిస్తూ గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు తమకు ఉందనే విషయాన్ని స్పష్టం చేయాలని సూచించారు.

babu
babu

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్టీ నాయకులతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా పాత్రను ప్రజలకు వివరిస్తూ.. గ్రేటర్ ఎన్నికలకు సిద్ధమవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి చేసిన చోట ఓటు అడిగే హక్కు తమకు ఉందనే విషయాన్ని స్పష్టం చేయాలని సూచించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన పేదలను ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయాలని దిశానిర్దేశం చేశారు. డివిజన్ల వారిగా బలమైన నాయకులను ఆహ్వానించి ఎన్నికలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. తెదేపా దూరదృష్టి వల్లే అమెజాన్ వంటి సంస్థలు నేడు హైదరాబాద్ వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల, అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కంభంపాటి రామ్ మోహన్ రావు, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: ఇస్రో ప్రయోగం విజయవంతంపై సీఎం కేసీఆర్ హర్షం

ABOUT THE AUTHOR

...view details