తెలంగాణ

telangana

Solar power in GHMC offices: ఈ గ్రేటర్ కార్యాలయాలు నెట్​ జీరో సాధించాయి..

By

Published : Dec 3, 2021, 7:35 PM IST

Solar power in GHMC offices: నెట్ జీరో.. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో బాగా వినపడుతున్న పదం ఇది. నగరాల్లో కాలుష్యం పెరుగుతుండటంతో సౌర విద్యుత్తుకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సౌర విద్యుత్తుతో కరెంటు బిల్లులు తగ్గడమే గాక విద్యుదుత్పత్తికి వినియోగించే సహజవనరుల ఖర్చు తగ్గే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫలితంగా పర్యావరణ కాలుష్యమూ తగ్గుతుంది. జీహెచ్​ఎంసీ​ పరిధిలోని ఐదు​​ కార్యాలయాలు ఈ నెట్ జీరో ఘనతను సాధించాయి.

solar power in municipal offices
మున్సిపల్​ కార్యాలయాల్లో సోలార్​ పవర్​

Solar power in GHMC offices: ప్రభుత్వ కార్యాలయాలు అంటే విద్యుత్తు దుబారా చేస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇష్టారీతిన కరెంటు వాడుతూ ప్రతి నెలా పరిమితికి మించి బిల్లు కట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కొన్ని కార్యాలయాల్లో అయితే నెలల తరబడి బిల్లులు బకాయి పడుతుంటాయి. వీటన్నింటికీ స్వస్తి చెబుతూ హైదరాబాద్​ మహా నగరపాలక సంస్థ.. స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. తన పరిధిలోని కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు, జంతు సంరక్షణ కేంద్రాలు, ఇతరత్రా భవనాల విద్యుత్తు అవసరాలను సౌర విద్యుత్తుతో తీర్చుకునేందుకు నడుంబిగించింది. అందులో భాగంగా ఏడాది క్రితం అధికారులు 34 ప్రాంతాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. వాటి సామర్ధ్యం 941 కిలో వాట్లు. వాటి నుంచి 14 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.

electricity bill zero in GHMC offices:సౌర విద్యుత్తు వాడకంతో ఎల్బీనగర్, ఉప్పల్, అల్వాల్ సర్కిల్ కార్యాలయాలు, మొఘల్​పురా క్రీడా ప్రాంగణం, లింగంపల్లి నూతన మున్సిపల్ కార్యాలయం విద్యుత్ బిల్లు సున్నాకు చేరింది. అక్కడ వాడుతున్న కరెంట్, సౌర పలకల ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ దాదాపు సమానంగా ఉంటుంది. త్వరలోనే మిగతా కార్యాలయాలు ఈ ఘనతను సాధిస్తాయని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్​ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిలువు తోటలు, హరితహారం, వ్యర్థాల రీసైక్లింగ్, సౌర విద్యుత్తు వంటి కార్యక్రమాలతో జీహెచ్ఎంసీ పరిధిలోని కార్యాలయాలను హరిత భవనాలుగా తీర్చిదిద్దుతున్నామని కమిషనర్ వెల్లడించారు.

ఇదీ చదవండి:central clarity on paddy procurement : స్పష్టంగా చెప్పాం.. అయినా తెరాస గందరగోళం సృష్టిస్తోంది: పీయూష్‌ గోయల్‌

ABOUT THE AUTHOR

...view details