తెలంగాణ

telangana

Suraksha Diwas Celebrations : రాష్ట్రవ్యాప్తంగా 'సురక్ష దివాస్' వేడుకలు.. ఊరువాడ ఖాకీల బైక్ ర్యాలీలు

By

Published : Jun 4, 2023, 3:43 PM IST

Suraksha Diwas Celebrations

Telangana Decade Celebrations 0n police bike rally : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ 'సురక్ష దివాస్' పేరుతో పోలీసులు సమాజంలో శాంతి భద్రతలపై చేస్తున్న సేవలను గుర్తుచేసుకుంటూ ర్యాలీలు నిర్వహించారు. కేసీఆర్ ఆద్వర్యంలో పోలీసు శాఖకు పెద్దపీట వేశారని శాంతి భద్రతలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామంటూ పోలీసులు వాగ్దానాలు చేశారు.

Telangana Decade Celebrations Today programs : రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో విప్లవాత్మక మార్పులు చేపట్టి ప్రజలకు భరోసా కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో శాంతి భద్రతల విషయంలో ఎన్నో అనుమానాలుండేవని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కేసీఆర్ ముందుచూపుతో దేశంలోనే ఉత్తమమైన పోలీసులుగా పేరు పొందారని మంత్రి తలసాని పేర్కొన్నారు.

"రాష్ట్రం ఏర్పడిన కొత్తలో భద్రత విషయంలో అనేక అనుమానాలు ఉండేవి. కేసీఆర్ ముందు చూపుతో ఇప్పుడు దేశంలోనే ఉత్తమ పోలీసు వ్యవస్థ మన దగ్గర ఉంది. కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, నూతన పోలీసు స్టేషన్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మించి గొప్ప పోలీసింగ్ వ్యవస్థను నిర్మించుకున్నాం".- మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి

కూకట్‌పల్లిలో బాలానగర్ జోన్ పోలీసులు సురక్ష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా కూకట్‌పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ హాజరై జెండా ఊపి పోలీసుల ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ లో దేశానికే తలమానికంగా నిలిచారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ కొనియాడారు. సురక్ష దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఊపి పోలీస్ వాహనాల భారీ ర్యాలీని ప్రారంభించారు.

Warangal CP Ranganath Bike Rally : వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్ష దినోత్సవ వేడుకలలో ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ప్రభుత్వం వెయ్యి కోట్ల నిధులతో పోలీసులకు ప్రత్యేక వాహనాలను అందించిందని తెలిపారు. తొమ్మిదేళ్ల కాలంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతాలు కలగకుండా పోలీసులు పని చేస్తున్నారని మంత్రి కొప్పులు ఈశ్వర్‌ అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడి లేని గొప్ప వ్యవస్థను, కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిదని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

"పోలీసుశాఖకు ప్రభుత్వం నుంచి మంది ఆదరణ లభిస్తోంది. దీంతో మంచి ఫలితాలు సాధించడం జరుగుతోంది. ఇవాళ తెలంగాణ పోలీసు దేశంలోనే గొప్ప పోలీసు వ్యవస్థగా రూపొందింది. అధునాతన వాహనాలు, సిగ్నలింగ్ వ్యవస్థ మన దగ్గర ఉంది."- అంజనీ కుమార్, డీజీపీ

ఆనాటి వ్యవస్థలో వెట్టి చాకిరి ఉండేదని.. పోలీసులు నానా కష్టాలు పడేవారని గుర్తు చేసుకున్నారు. నారాయణ పేట జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్ష దివాస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ అపూర్వ రావు కలిసి జెండా ఊపి ర్యాలీనీ ప్రారంభించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా 'సురక్ష దివాస్' వేడుకలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details