Suraksha Day in Decade Celebrations : దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు సురక్ష దినోత్సవం

author img

By

Published : Jun 4, 2023, 8:43 AM IST

Police Department Safety Day 2023
Police Department Safety Day 2023 ()

Suraksha Day in Telangana Decade Celebrations : తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు పోలీస్‌ శాఖ సురక్ష దినోత్సవం నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేడుకలు ఘనంగా సాగనున్నాయి. ఉదయం నుంచి పలు జిల్లాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు, పోలీస్‌ శాఖ పని తీరు.. అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, డీజీపీ, పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు పాల్గొననున్నారు.

Decade Celebrations in Telangana 2023 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో పోలీస్‌ శాఖ సురక్ష దినోత్సవం పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉదయం 9 గంటలకు ట్యాంక్‌ బండ్‌ మీద పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనాలు.. బ్లూ కోల్ట్స్‌ ర్యాలీ చేస్తారు. ట్యాంక్‌ బండ్‌ మీదగా లిబర్టీ, అబిడ్స్‌, మోజంజాహి మార్కెట్‌, రవీంద్ర భారతి, ఇక్బాల్‌ మినార్‌, బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం.. ఇందిరాగాంధీ విగ్రహం, నెక్లెస్‌ రోడ్డు మీదగా సంజీవయ్య పార్క్‌కు చేరుకొని ర్యాలీ ముగుస్తుంది.

Suraksha Day in Telangana Today : సాయంత్రం 4 గంటలకు సచివాలయం, బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద.. సాంకేతిక ప్రదర్శన, వీనుల విందైన పోలీస్‌ బ్యాండ్‌, జాగిలాల ప్రదర్శన, ఫోరెన్సిక్‌ విభాగంతో ఫొటో ప్రదర్శన జరగనుంది. వేలిముద్రల విభాగం, బాంబు డిస్పోజబుల్‌ సిబ్బంది డ్రిల్‌.. కమ్యూనికేషన్‌ విభాగం పరికరాల ప్రదర్శన, అగ్నిమాపక శాఖ మాక్‌డ్రిల్‌ నిర్వహణతో పాటు.. జైళ్ల శాఖ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. పోలీసులు, మైత్రి కమిటీ సభ్యులు కలిసి పెద్ద ఎత్తున రూట్‌ మార్చ్‌ నిర్వహించనున్నారు.

21 Days Decade celebrations in Telangana : బంజారాహిల్స్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి ప్రారంభం కానున్న రూట్‌మార్చ్‌.. రోడ్డు నెంబర్‌ 12 మీదుగా, ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, ఎన్టీఆర్‌ భవన్‌, క్యాన్సర్‌ ఆసుపత్రి.. బీఆర్‌ఎస్‌ భవన్‌ మీదుగా తిరిగి కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి చేరుకుంటుంది. ఆ ర్యాలీలో దాదాపు 1000 మంది పోలీసులు పాల్గొననున్నారు. ర్యాలీ దృష్ట్యా పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

రాత్రి 7 గంటలకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో తీగల వంతెన వద్ద.. పోలీసులు ప్రత్యేకంగా డ్రోన్‌ ప్రదర్శన నిర్వహించనున్నారు. విద్యుత్‌ కాంతులతో కొనసాగే ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంటుందని అధికారులు తెలిపారు. సురక్ష దినోత్సవం సందర్భంగా పోలీసులకు అందరూ సహకరించాలని ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ నెల రెండో తేదీన రాష్ట్రంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి దశాబ్ది ఉత్సవాలను చేసుకున్నారు. రెండో రోజు రైతు దినోత్సవం నిర్వహించారు. రైతులకు అందిస్తున్న పథకాల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. రాష్ట్రం అవతరించిన తరవాత వ్యవసాయంకు కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన కృషిని తెలిపారు. ఈ దశాబ్ది వేడుకలు 21 రోజుల పాటు జరగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్సవాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.