తెలంగాణ

telangana

HC on Double Bed Room Houses: 'ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించలేం'

By

Published : Dec 9, 2021, 11:19 AM IST

HC on Double Bed Room Houses: తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని వచ్చిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

HC on Double Bed Room Houses
రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు

HC on Double Bed Room Houses: రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీలు, వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్ జెండర్లు తదితరులకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ.. శివప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్​పై సీజే జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం విచారణ చేపట్టింది.

రెండు పడక గదుల ఇళ్లను ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని వర్గాలకు కేటాయించనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొన్నందున.. హైకోర్టు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇళ్లను ఎవరికి కేటాయించారనే విషయంపై విచారణ చేపట్టలేమని స్పష్టం చేస్తూ.. పిటిషన్​ను కొట్టేసింది.

ఇదీ చూడండి:ఆర్మీ హెలికాప్టర్ క్రాష్​కి ఒక్క నిమిషం ముందు వీడియో

ABOUT THE AUTHOR

...view details