తెలంగాణ

telangana

మళ్లీ అప్పు చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. ఈసారి ఎంతంటే..?

By

Published : Oct 28, 2022, 5:29 PM IST

TS Government Debt: రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్ ​బ్యాంకు వేయనున్న బాండ్ల వేలంలో మరో రూ.1500 కోట్లను రుణంగా సమీకరించుకోనుంది.

Telangana Loan
Telangana Loan

TS Government Debt: రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో రూ.1500 కోట్లను సమీకరించుకోనుంది. ఇందుకోసం 17, 18 ఏళ్ల కాలానికి రూ.750 కోట్ల చొప్పున రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. బాండ్లను రిజర్వ్ బ్యాంకు వచ్చే నెల ఒకటో తేదీన వేలం వేయనుంది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.23 వేల కోట్ల రుణం తీసుకుంది. తాజాగా రూ.1500 కోట్లతో.. అప్పు మొత్తం రూ.24,500 కోట్లకు చేరనుంది.

ABOUT THE AUTHOR

...view details