తెలంగాణ

telangana

Online bonalu: అమ్మవారికి ఆన్​లైన్​లో బోనం... ఇలా బుక్​ చేసుకోండి!

By

Published : Jul 10, 2021, 9:08 AM IST

ఈ కరోనా సమయంలో బోనాలకు(bonalu festival) వెళ్లేందుకు ఆలోచిస్తున్నారా. అమ్మవారికి మొక్కులు ఎలా చెల్లించాలి అని అనుకుంటున్నారా? అలాంటి వారి కోసమే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ (telangana endowment department) ఆన్​లైన్​ బోనాలకు (online bonalu) శ్రీకారం చుట్టింది. ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌ బోనాలను బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. గోత్రనామాలతో పూజలు చేసి... పోస్టులో అమ్మవారి ప్రసాదం పంపిస్తారు. అసలు ఈ ఆన్​లైన్​ బోనాల గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివాల్సిందే!

Online bonalu
అమ్మవారికి ఆన్​లైన్​లో బోనం

అమ్మవారికి ఆన్​లైన్​లో బోనం

బోనాల జాతర (bonalu festival) అంటే మనకు గుర్తుకు వచ్చేది లష్కర్ బోనాలు(lashkar bonalu). ఏటా ఆషాడమాసంలో నిర్వహించే ఈ బోనాల పండుగకు ఎక్కడ లేని గుర్తింపు ఉంది. మొదటగా భాగ్య నగరంలో గోల్కొండ బోనాల(golconda bonalu)తో మొదలవుతుంది. ఓల్డ్ సిటీలో రంగం కార్యక్రమం తర్వాత ఉమ్మడి దేవతల ఊరేగింపు జరగనుంది.

ఇదీ చూడండి:Bonalu: జులై 11న గోల్కొండ, 25న లష్కర్ బోనాలు

ఆన్​లైన్​ బోనాలు

బోనాల జాతర కోసం నగరంలోని అమ్మవారి దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో హైదరాబాద్​లో బోనాల సందడి (bonalu festival) షురూ అయింది. కరోనా ప్రభావంతో భక్తులు (devotees ) ప్రత్యక్షంగా బోనాలు సమర్పించే పరిస్థితులు కన్పించడంలేదు. అందుకే.. మహంకాళి ఆలయ నిర్వాహకులు ఆన్‌లైన్ బోనాలను (online bonalu) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే నిర్వాహకులే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఈ ఏడాది లష్కర్‌ బోనాలతో ఈ ప్రయోగానికి దేవాదాయ, తపాలా శాఖలు సంయుక్తంగా శ్రీకారం చుట్టాయి.

రాష్ట్ర పండుగ

ఆషాఢం తొలి ఆదివారమైన ఈనెల 11న గోల్కొండ కోటలో (golconda fort) ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రాష్ట్ర పండుగగా జరిగే ఈ వేడుకలకు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి, గోల్కొండ జగదాంబిక, బల్కంపేట ఎల్లమ్మ, పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి.

ఇదీ చూడండి:భవిష్యవాణి రంగం కార్యక్రమం విశేషాలు చుద్దామా

భక్తుల కోసం...

రాష్ట్రంలో జరిగే బోనాల పండుగకు దేశవ్యాప్తంగా భక్తులు వస్తుంటారు. కరోనా (Corona) నేపథ్యంలో దేవాలయాలకు రాని భక్తుల సౌకర్యార్థం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆన్‌లైన్‌ బోనాలను (online bonalu) అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్‌ బోనాలను బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. ఆన్‌లైన్‌ బోనాలు బుక్ చేసుకున్న భక్తుల గోత్రనామాలతో ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ప్రసాదం డ్రైఫ్రూట్స్‌ను పోస్టు ద్వారా నేరుగా భక్తుల ఇంటికి పంపిస్తారు. దీనికి సుమారు 150 రూపాయల వరకు ఖర్చవుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తపాల ఛార్జీలు అదనంగా ఉంటాయి.

క్యూఆర్​ కోడ్​ ద్వారా

భక్తులు తమ కానుకలను గతంలో అమ్మవారి హుండీలోనే వేసేవారు. కానీ..ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా వేయవచ్చని అందుకోసం ఈ-హుండీ ఏర్పాటు చేశారు. భక్తులు ఎక్కడి నుంచైనా క్యూఆర్​ కోడ్ (QR code) ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు సమర్పించవచ్చు. ఇందుకోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ujjayinimahamkali.org వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. పూజలు, అభిషేకాలు బుక్ చేసుకోవచ్చని ఆలయ ప్రధాన అర్చకులు రాంతీర్థశర్మ తెలిపారు.

ఇదీ చూడండి:BONALU: ఈసారి ఘనంగా బోనాల జాతర.. రూ.15 కోట్లు కేటాయింపు!

ABOUT THE AUTHOR

...view details