తెలంగాణ

telangana

రవీంద్రభారతి వద్ద ఉపాధ్యాయుల నిరసన

By

Published : Sep 5, 2019, 11:52 PM IST

గురు పూజోత్సవం వేళ అంతర్‌ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యాయులు శాసనమండలి సభ్యులను అడ్డుకున్నారు.

అంతర్​ జిల్లా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల నిరసన

అంతర్​ జిల్లా బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయుల నిరసన

వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ భార్యభర్తలను అంతర్​ జిల్లా బదిలీలు చేయాలని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. గురుపూజోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకలకు హాజరై తిరిగి వెళ్తున్న ఎమ్మెల్సీల వాహనాలు అడ్డుకుని నిరసన తెలిపారు. ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, రఘోత్తం రెడ్డి, జనార్దన్‌ రెడ్డి వాహనాలు అడ్డుకుని తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. అంతర్‌ జిల్లా బదిలీలపై స్పష్టమైన హామీ ఇవ్వనందున జనార్దన్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివిధ శాఖల్లో అంతర్‌ జిల్లా బదిలీలు జరిగాయని, విద్యాశాఖలో మాత్రమే బదిలీలు జరగలేదని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి జీవో జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అమలు చేయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు.

sample description

ABOUT THE AUTHOR

...view details