తెలంగాణ

telangana

'రాష్ట్ర ఖజనా ఖాళీ అవుతుంటే..జగన్ ఆస్తులు పెరుగుతున్నాయి'

By

Published : Oct 11, 2021, 12:11 PM IST

రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా ఏపీ సీఎం జగన్‌కు (ap cm jagan) పట్టడం లేదని తెలుగుదేశం నేత (tdp leader) బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. తన బంధువులు, అనుచరులకు జగన్‌ లబ్ధి కలిగిస్తున్నారన్న ఆయన.. క్విడ్‌ప్రోకోపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

bandaru
bandaru

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు (ap cm jagan) చెందిన నల్లధనమే హెటిరో (hetero raids), అరబిందో, రాంకీ సంస్థల్లో చలామణి అవుతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంటే.. జగన్, ఆయన బంధువుల ఆస్తులు మాత్రం పెరుగుతున్నాయన్నారు.

'రాష్ట్ర ఖజనా ఖాళీ అవుతుంటే..జగన్ ఆస్తులు పెరుగుతున్నాయి'

"హెటిరో ఆస్తుల విలువ 2017లో రూ.2306కోట్లు, 2018లో రూ.2,418కోట్లు, 2019 నాటికి రూ.2,361కోట్లుగా ఉంటే జగన్ సీఎం అయిన రెండేళ్లలో రూ.5,389కోట్లకు పెరిగాయి. జగన్ సోదర సంస్థలపై జరిగిన దాడుల్లో క్విడ్ ప్రోకో 2 తాలుకూ నల్లధనం వివరాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. భారతీ సిమెంట్ షేర్ ధరలు రోజురోజుకూ పెరుగుతుంటే, రాష్ట్ర ఆస్తులు, పేదల సంపద, రోజురోజుకూ తరుగుతోంది. విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందోకు విశాఖలో 108 ఎకరాలు కట్టబెట్టడంతో పాటు, బేపార్కులో రూ.265కోట్లు విలువ చేసే 9ఎకరాలు ఇచ్చేశారు. ఈ సంస్థకు చెందిన నిత్యానందరెడ్డి రూ.3900 కోట్లతో సంపన్నుల జాబితాలో చేరారు. రూ.2160 కోట్లు విలువ చేసే కాకినాడ సెజ్​తో పాటు, 108, 104 అంబులెన్సులకు సంబంధించిన రూ.478 కోట్ల కాంట్రాక్ట్​ను అరబిందోకు అప్పగించారు. సీబీఐ, ఈడీ కేసులున్న వ్యక్తిని తితిదే పాలకమండలి సభ్యుడిగా నియమించారు. రాంకీ సంస్థకు చెందిన అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ పదవి ఇచ్చారు. క్విడ్ ప్రోకో 1 జాబితాలో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. ఈడీ విభాగం హెటిరో సంస్థలో జరిపిన సోదాల తాలుకూ వివరాలు బహిర్గతం చేయటంతో పాటు ప్రధాన మంత్రి ఈ అంశంపై దృష్టి సారించాలి"- బండారు సత్యనారాయణ, మాజీ మంత్రి

ఇదీ చూడండి:IT Raids on Hetero: హెటిరో డ్రగ్స్‌ కార్యాలయంతో పాటు ప్రొడక్షన్‌ కేంద్రాల్లో సోదాలు

ABOUT THE AUTHOR

...view details