తెలంగాణ

telangana

Talasani Latest Comments on BJP : 'తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు'

By

Published : Nov 27, 2022, 4:28 PM IST

Updated : Nov 27, 2022, 5:26 PM IST

Minister Talasani Latest Comments On BJP : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం టీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెడుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్​ఎస్ భయపడేది లేదని స్పష్టం చేశారు.

Talasani Srinivas Yadav Comments On BJP
Talasani Srinivas Yadav Comments On BJP

Minister Talasani Latest Comments On BJP: రాష్ట్రంలో బీజేపీ పార్టీ గాలిబుడగ లాంటిదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో బీజేపీ బ్రహ్మాండంగా పనులు చేస్తే ప్రధాని మోదీ వందసార్లు ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. మొన్నటి మునుగోడులో అనేకమంది గద్దల్లా తిరిగారని.. ఇప్పుడెవరైనా ఆవైపు వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే తిరుగుతున్నారని తెలిపారు. హైదరాబాద్​ తెలంగాణ భవన్​లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ నేతలను మంత్రులు, ఎమ్మెల్యేలను కేంద్రం ఇబ్బందులు పెడుతోందని మంత్రి తలసాని ఆరోపించారు. మంత్రి మల్లారెడ్డి పట్ల ఐటీ అధికారులు అనైతికంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్​ఎస్ భయపడేది లేదని స్పష్టం చేశారు. సమయం అందరికి వస్తుందని.. రేపు మీ పరిస్థితి ఇలాగే వస్తుందని తెలిపారు. కుస్తీ పోటీలే పెట్టినట్లు చేస్తే తాము సిద్ధమేనని పేర్కొన్నారు.

హైదరాబాద్ టీఆర్​ఎస్ అడ్డా: హైదరాబాద్ టీఆర్​ఎస్ అడ్డా అని మంత్రి తలసాని స్పష్టం చేశారు. గడిచిన ఎనిమిదేళ్లలో అనేక కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ప్రజలకు వివరించాలని సూచించారు. సమ్మేళానాలలో సమస్యలను గుర్తించి వాటిని ఎక్కడికక్కడ పరిష్కరించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో కొంతమందికి అవకాశాలు రాలేదని అసంతృప్తులు ఉండడం సహజమన్న మంత్రి.. సందర్భాన్ని బట్టి అవకాశం ఇంటికే వస్తుందని చెప్పారు. వారు అవకాశం కోసం వేచి చూడాలని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాల తర్వాత నిజాం కాలేజీ మైదానంలో భారీ సభను ఏర్పాటు చేస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.

"125 సంవత్సరాలు చరిత్ర ఉన్న పార్టీ అంతరించిపోతుంది. దానికి అతీగతీ లేదు. ఆ పార్టీ పరిస్థితి ఎంటో మనందరికి తెలుసు. రెండోది బీజేపీ పార్టీ నీటి మీద గాలి బుడగ లాంటింది. టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ. ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు. ఈరోజు హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా. ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా ఏమీ చేయలేరు. 8 ఏళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం." - తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మంత్రి

'తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు'

ఇవీ చదవండి:హైదరాబాద్‌పై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్.. బీజేపీని ఎదుర్కొనేందుకు మాస్టర్ ప్లాన్

126 ఏళ్ల వయసులోనూ సూపర్​ ఫిట్.. సీక్రెట్ ఇదేనట!

Last Updated :Nov 27, 2022, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details