తెలంగాణ

telangana

ఆన్​లైన్​లో సినిమా టికెట్లకు చెల్లుచీటి...: మంత్రి తలసాని

By

Published : Sep 21, 2019, 4:13 PM IST

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాన్ని ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వమే టికెట్లను అమ్మే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఇక ఆన్​లైన్​లో సినిమా టికెట్లు అమ్మనివ్వం!

సినిమా టికెట్ల విషయంలో ఆన్​లైన్ అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం అధికారికంగా టికెట్లను అమ్మేలా ప్రణాళిక చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. ప్రభుత్వమే నేరుగా టికెట్లు విక్రయిస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని మంత్రి పేర్కొన్నారు. చిత్రపరిశ్రమలో కుటుంబంతో సంబంధం లేకుండా ప్రతిభావంతులే హీరోలు అవుతారని చెప్పారు. రేస్ కోర్స్​ టాక్స్​పై స్పెషల్ డ్రైవ్ చేశామని.. గతంలో లక్షల్లో కట్టేది ఇప్పుడు కోట్లల్లో కడుతున్నారని ఆయన వివరించారు.

TG_Hyd_35_21_Talasani_On_Cinema_Tickets_AV_3064645 Reporter: Nageswara Chary Script: Razaq Note: మంత్రి తలసాని శ్రీనివాస్ రెడ్డి ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) సినీమా టికెట్ల విషయంలో అన్‌లైన్‌ అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం అధికారికంగా సినిమా టికెట్ల అమ్మకాల కోసం ప్లాన్ చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి టికెట్ల అమ్మకాలు చేపడితే నిర్మాతలు డిస్ట్రీబ్యూటర్లు లాభపడుతారని మంత్రి పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీలో తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. థియేటర్లలో 18 నుంచి 20లైనులు....8 నుంచి 10వరుసల సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి వివరించారు. సినిమా పరిశ్రమలో ఫ్యామిలీతో కుటుంబంతో సంబంధంలేకుండా టాలెంట్ ఉన్నోడే హీరో అవుతాడని చెప్పారు. రేస్ కోర్స్‌ టాక్స్‌పై స్పెషల్ డ్రైవ్ చేశామని గతంలో లక్షల్లో కట్టేది ఇప్పుడు కోట్లలో కడుతున్నారని తలసాని వివరించారు. Visu

TAGGED:

ABOUT THE AUTHOR

...view details