తెలంగాణ

telangana

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే..

By

Published : May 20, 2022, 3:38 AM IST

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు నేడే..

Disha encounter case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు తీర్పును ఇవాళ వెలువరించనుంది. 2019 నవంబర్‌ 27న యువ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను విచారణ సందర్భంగా... పారిపోయేందుకు ప్రయత్నించడంతోపాటు... పోలీసుల వద్ద ఉన్న తుపాకులు లాక్కొని కాల్పులు జరపడంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మరణించారు. ఈ ఘటనపై మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

Disha encounter case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును వెలువరించనుంది. 2019 నవంబర్‌ 27న యువవైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నలుగురు యువకులను విచారణ సమయంలో పారిపోయేందుకు యత్నించడంతోపాటు పోలీసుల వద్ద తుపాకులు లాక్కొని కాల్పులు జరపగా నలుగురు నిందితులు మరణించారు. ఆ ఘటనపై మానవహక్కుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్​పై విచారణ జరిపేందుకు. 2019 డిసెంబర్‌ 12న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సిర్పుర్కర్‌ కమిషన్‌ను నియమించింది. ఆరునెలల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

ఎన్‌కౌంటర్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టిన కమిషన్‌.. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురు కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్లు నమోదుచేసింది. ఎన్‌కౌంటర్‌లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందిని కూడా కమిషన్ విచారించింది. కరోనా కారణంగా దర్యాప్తు ఆలస్యం కావడతో ఈ ఏడాది జనవరి 28న కమిషన్‌ తన నివేదికను సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకి అందజేసింది. ఈసందర్భంగా కేసు విచారణను వాయిదా వేస్తూ నివేదికను పరిశీలించాకే విచారణ జరపనున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

మొత్తం 47 రోజులపాటు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన కమిషన్.. అప్పటి సీపీ సజ్జనార్, సిట్ ఛైర్మన్ మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీతో పాటు పలువురు పోలీసులు అధికారులు, ఎన్‌కౌంటర్ మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను విచారించింది. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు పరిశీలించి... 57 మంది సాక్షులను విచారించినట్లు నివేదికలో పేర్కొంది. కమిషన్‌ ఇచ్చిన నివేదిక, మానవహక్కుల సంఘాలు, ప్రభుత్వ వాదనలు అన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు... తుది తీర్పును ఈరోజు వెలువరించనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details