తెలంగాణ

telangana

రుషికొండ నిర్మాణాలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

By

Published : Nov 11, 2022, 7:42 PM IST

SC On Rushikonda Constructions: రుషికొండ నిర్మాణాలపై దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నిర్మాణాలపై హైకోర్టులోనే ప్రస్తావించాలని.. పిటిషనర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు సూచించింది. పర్యావరణ అనుమతులు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారని, హైకోర్టు ఆదేశాలనూ పాటించట్లేదని రఘురామ తరఫు న్యాయవాది వాదించి.. స్టే విధించాలని కోరగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమని సుప్రీం స్పష్టం చేసింది.

రుషికొండ నిర్మాణాలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు
రుషికొండ నిర్మాణాలు.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు

Supreme Court On Rushikonda: రుషికొండపై రాష్ట్ర ప్రభుత్వం.. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను విస్మరించి చేపడుతున్న నిర్మాణాలు నిలిపివేయాలనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు నివేదించాలని పిటిషనర్‌, ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇప్పటికే ఈ విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను రాష్ట్ర హైకోర్టు ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎస్‌ఎ ఓఖాల ధర్మాసనం గుర్తు చేసింది.

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇప్పుడే జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. రుషికొండలో పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేసేలా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని, కొండలో చాలా ప్రాంతాన్ని తవ్వేశారని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని వాదనల్లో... ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.

పర్యావరణానికి జరిగిన నష్టంపై అధ్యయనం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించినా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు కొనసాగిస్తూనే ఉందని.. ఇప్పుడు ఆ పనులు నిలపకపోతే.. ఇంకా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కనపెట్టి నిర్మాణ పనులు నిరాటంకంగా చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం.. ఇందుకు సంబంధించి చెప్పాలనుకున్న అన్ని విషయాలను హైకోర్టు ముందు ఉంచాలని సూచించారు. పిటిషన్‌ వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తూ.. తుది ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details