తెలంగాణ

telangana

చంద్రబాబుతో గడిపిన సమయం ఎంతో విలువైనది: సూపర్‌స్టార్ రజినీకాంత్‌

By

Published : Jan 10, 2023, 6:18 PM IST

Super Star Rajinikanth Tweet Today : టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల్లో మరింత గొప్ప విజయం అందుకోవాలని సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఆకాంక్షించారు. సుధీర్ఘకాలం తర్వాత తన మిత్రుడు చంద్రబాబును కలిశానని.. ఆయనతో గడిపిన సమయం ఎంతో విలువైనదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు.

చంద్రబాబుతో రజినీకాంత్​
చంద్రబాబుతో రజినీకాంత్​

Super Star Rajinikanth Tweet Today : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరింత గొప్ప విజయం అందుకోవాలని సూపర్‌స్టార్ రజినీకాంత్‌ ఆకాంక్షించారు. సుధీర్ఘకాలం తర్వాత తన మిత్రుడు చంద్రబాబును కలిశానని.. ఆయనతో గడిపిన సమయం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్​ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని నివాసంలో చంద్రబాబుతో రజినీకాంత్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

మరోవైపు తలైవా రజినీకాంత్​ను కలవడంపై చంద్రబాబు సైతం హర్షం వ్యక్తం చేశారు. తన ప్రియమిత్రుడైన సూపర్​స్టార్​ను కలవడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విటర్‌లో ఫొటోను పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details