తెలంగాణ

telangana

suicides at Hyderabad cable bridge : ఆత్మహత్యలకు అడ్డాగా హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్

By

Published : May 7, 2023, 2:06 PM IST

suicides at Hyderabad cable bridge : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దుర్గం చెరువు తీగల వంతెనను నిర్మాణాన్ని చేపట్టింది. ప్రారంభమైన కొద్ది రోజుల నుంచి పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. రాష్ట్రంలో ఉన్న ఐకాన్​లో దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెన బ్రిడ్జి ఒకటి. కానీ ఇప్పుడు ఈ బ్రిడ్జి ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి దాదాపు ఏడుగురు బల్మమరణం చేసుకోన్నట్లు సమాచారం.

suicides at cable bridge
కేబుల్​ బ్రిడ్జి వద్ద పెరుగుతున్న సూసైడ్స్

suicides at Hyderabad cable bridge : హైదరాబాద్​ నగరంలో భారీగా ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఐటీ కారిడార్‌కు వాహనాల రాకపోకలు సులువుగా ఉండేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దాదాపు 184 కోట్ల వ్యయంతో బ్రడ్జి పనులను పూర్తి చేశారు. పర్యాటకులు సందర్శించడానికి వీలుగా తీగల వంతెన నిర్మాణం చేపట్టారు.

హైదరాబాద్ సిగలో మరో మణిహారంగా వెలుగొందుతున్న ఈ బ్రిడ్జి కొంతకాలంగా ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. ఈ మధ్య ఇక్కడ ఆత్మహత్యలు ఎక్కువ కావడంతో దుర్గం చెరువు లేక్ వద్ద పోలీస్ స్టేషన్​ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. చెరువు చుట్టు సీసీ కెమెరాలను అమర్చి నిరంతరం నిఘా ఉంచుతున్నారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడుతూ గానీ, ప్రమాదశాత్తు గానీ నీటిలో పడితే వారిని కాపాడానికి రెండు పడవలను సిద్దంగా ఉంచారు.

కేబుల్ బ్రిడ్జ్ వద్ద పెరుగుతున్న మరణాలు:ఇటీవల కాలంలో వివిధ కారణాలతో తీగల వంతెన పైనుంచి దూకి దాదాపు ఏడుగురు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​కు చెందిన స్వప్న దుర్గం చెరువులో దూకి గత సంవత్సరంలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె బ్యాగ్​లో లభించిన లేఖ ఆధారంగా ఆమె చనిపోయినట్లు పోలీసులు ధ్రువీకరించారు. మే 6వ తేదీన మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని డీఆర్ఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ తెలిపారు. అతడి కోసం రెండు డీఆర్ఎఫ్ బృందాలు, రెండు పడవల సాయంతో 12 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు.

ఇలా ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశామని శౌకత్ తెలిపారు. పాతాళా గడియ అనే పరికరం ద్వారా మృతదేహన్ని గుర్తించే ప్రయత్నం చేశామని వెల్లడించారు. రాష్ట్రానికి ఐకాన్​గా ఉన్న దుర్గం చెరువు తీగలవంతెన ఆత్మహత్యలకు అడ్డాగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలను తీసుకుని మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

"కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి ఒక వ్యక్తి చెరువులో దూకాడని డీఆర్ఎఫ్ కంట్రోల్​ రూమ్​కు సమాచారం అందింది. మేము దగ్గరలో ఉన్న డీఆర్ఎఫ్ వాహనాలను టర్నౌట్ చేయడం జరిగింది. 2 వాహనాలలో 2 పడవలు ఉంటాయి. వాటితో చెరువులో రెస్క్యూ ఆపరేషన్ చేశాము. సర్చ్​ అండ్ రెస్క్యూ ఆపరేషన్​లో మా సిబ్బందితో మా దగ్గర ఉన్న రోప్​ సాయంతో వెతుకుతాము. దొరకగానే పోలీసులకు అప్పగిస్తాము." - శౌకత్, డీఆర్ఎఫ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details